ఆ జడ్జిది పలానా కులం... ఆ జడ్జిని చంద్రబాబు మ్యానేజ్ చేసాడు. ఈ జడ్జిని మరోరకంగా చేసారు. ఈ జడ్జి మాకు వ్యతిరేకంగా తీర్పులు ఇస్తున్నాడు, క-రో-నా వార్డులో పడేయాలి.. ఇలా వైసీపీలో పై స్థాయి ప్రజా ప్రతినిధుల నుంచి, కింద స్థాయి సోషల్ మీడియా బ్యాచ్ వరకు, అందరూ జడ్జిల పై చేసిన కామెంట్స్, చేసిన అరాచకం అంతా ఇంతా కాదు. చివరకు ముఖ్యమంత్రి హోదాలో జగన్ మోహన్ రెడ్డి కూడా, ఇలాగే జడ్జిల పై, కోర్టుల పై కామెంట్స్ చేసారు. ఈ వైసీపీ బ్యాచ్ చేసిన అరాచకం ఎక్కడి దాకా వెళ్ళింది అంటే, ఏకంగా హైకోర్టు, వీళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చే దాకా వెళ్ళింది. చివరకు ఇది సిఐడి విచారణకు ఇవ్వగా, అక్కడ కూడా సరైన న్యాయం జరగకపోవటం, సిబిఐకి ఈ కేసు అప్పచెప్పారు. దీనికి కారణం, కోర్టుల పై చేస్తున్న ఈ కామెంట్స్ వెనుక పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారని, అందుకే సిబిఐ విచారణకు ఆదేశాలు ఇస్తున్నామని చెప్పారు. ఆ తరువాత కూడా ఏ మాత్రం జంకు లేకుండా, తమ ప్రభుత్వం చట్ట వ్యతిరేక నిర్ణయాలు తీసుకుందేమో అని చూడకుండా, మమ్మల్ని కావాలని టార్గెట్ చేసారు అంటూ, హడావిడి చేసారు. అయితే ఇలా ఇన్నాళ్ళు వైసీపీ పార్టీని చూసిన ఏపి ప్రజలు, నిన్నటి నుంచి వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు చూసి ఆశ్చర్య పోతున్నారు. నిన్న ఎన్నికల కమిషన్ ఇచ్చిన షెడ్యుల్ ని, హైకోర్టు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.

ycp 12012021 2

దీంతో నిన్నటి నుంచి వైసీపీ నేతలు, హైకోర్టు ఇచ్చిన తీర్పు పై, తమ విజయంగా, నిమ్మగడ్డకు తగిన శాస్తిగా చెప్పుకున్నారు. కొడాలి నాని అయితే, ఇది కుక్క కాటుకి చెప్పు దెబ్బ అంటూ, హైకోర్టు చెప్పు దెబ్బలు కొట్టింది అనే విధంగా మాట్లాడారు. అలా అనుకుంటే, ప్రభుత్వానికి ఇప్పటికే కోర్టు కొట్టిన చెప్పు దెబ్బల లిస్టు డబల్ సెంచరీకి దగ్గరలో ఉందని కొడాలి నాని మర్చిపోయారేమో. ఇక మరో నాయకుడు అయితే, న్యాయం తమ వైపే ఉందని హైకోర్టు తీర్పుని గౌరవిస్తున్నాం అని అన్నారు. ఇలా ఎవరికి తోచింది వాళ్ళు చెప్తూ, హైకోర్టుని ఆకాశానికి ఎత్తేసారు. వైసీపీలో ఈ మార్పు చూసిన ప్రజలు ఆవాక్కయ్యారు. ఇప్పటికైనా వైసీపీకి కోర్టుల పట్ల, జడ్జిల పై మంచి అభిప్రాయం వచ్చినందుకు సంతోషిస్తూ, ఇక ముందు కూడా ఇలాగే కొనసాగాలని, వ్యతిరేక తీర్పులు వచ్చినప్పుడు కూడా, ఎక్కడ తేడా ఉందో చూసుకుని సరి చేసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా నిన్న ఇంత పెద్ద విషయంలో ఎదురు దెబ్బ తగిలినా, హుందాగా వేరే బెంచ్ ముందు అపీల్ చేసుకున్నారు కానీ, న్యాయవ్యవస్థను ఎవరూ విమర్శలు చేయలేదనే విషయం గుర్తుంచుకోవాలని అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read