రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం కసరత్తు చేస్తున్న ఎన్నికల కమిషన్, ఈ రోజు ఉదయం, రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించింది. ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకు, విడతల వారీగా అన్ని రాజకీయ పార్టీలను కలిసి వారి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. మధ్యానం 3 గంటల ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వంతో కూడా ఎన్నికల కమిషన్ చర్చలు జరిపింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీతో ఎన్నికల కమిషన్ భేటీ అయ్యింది. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సమావేశం అయ్యారు. ఉదయం రాజకీయ పార్టీలతో నిర్వహించిన సమావేశం యోక్క అంశాన్ని , వారి వారి అభిప్రాయలు, డిమాండ్లను ఎన్నికల కమీషనర్, చీఫ్ సెక్రటరీ దృష్టికి తెచ్చారు. సమావేశం మొత్తం వివరాలను, చీఫ్ సెక్రటరీతో పంచుకునట్టు తెలిసింది. ఈ నేపధ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం తరుపున సన్నద్ధతను, రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, అనే విషయం పై నివేదిక ఇవ్వాలని, చీఫ్ సెక్రటరీని నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోరినట్టుగా తెలిసింది. దీనికి సంబంధించి గంట పాటు జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తరుపున, చీఫ్ సెక్రటరీ తన నివేదికను , రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు అందచేసినట్టు సమాచారం. రాష్ట్రంలో క-రో-నా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదు అనే అభిప్రాయాన్ని చీఫ్ సెక్రటరీ, వ్యక్తం చేసినట్టు తెలిసింది.

రాష్ట్ర వ్యాప్తంగా క-రో-నా వైరస్, వ్యాప్తి పై అన్ని స్థాయిల్లో చర్యలు తీసుకుంటున్నా కూడా, ఇంకా అదుపులోకి రాలేదని, ప్రస్తుతం కూడా ప్రతి రోజు, మూడు వేల కేసులు వరకు నమోదు అవుతున్న పరిస్థితి ఉందని వివరించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపధ్యంలో ఎన్నికలు నిర్వహణ చేసినట్టు అయితే, వైరస్ వ్యాప్తి మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని, ఇది ప్రమాదం అని ఆమె తెలిపారు. అదే విధంగా ఎన్నికల నిర్వహణ కోసం, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు చాలా కీలకం అవుతారని, అయితే ముఖ్యంగా పోలీస్ విభాగంకి చెందినా వారు చాలా ఎక్కువగా కావలసి ఉంటుందని, అయితే ప్రస్తుతం రాష్ట్రంలో చూస్తే, పోలీస్ శాఖలోనే 11 వేల మంది, వైరస్ బారిన పడ్డారని నివేదికలు ఉన్నాయని, వీటి అన్నిటికి సంబంధించిన ఆధారాలతో సహా, నివేదికను పొందు పరిచి, ఆ నివేదికను చీఫ్ సెక్రటరీ, ఎన్నికల కమీషనర్ కు ఇచ్చారు. అదే విధంగా పలు ప్రభుత్వ విభాగాల్లో పని చేసే ప్రభుత్వ ఉద్యోగులు కూడా అవసరం అని, వారు కూడా చాలా మంది వైరస్ బారిన పడ్డారని, ప్రస్తుత పరిస్థితిలో వారు అందరూ కూడా ఎన్నికల నిర్వహణలో పాల్గునటం కష్టం అని కూడా నివేదికలో చెప్పినట్టు తెలుస్తుంది. ఈ పరిస్థితిలో ఎన్నికల నిర్వహణ కష్టం అనే అభిప్రాయాన్ని ప్రభుత్వం తరుపున చీఫ్ సెక్రటరీ, ఎన్నికల కమీషనర్ కు తెలిపారు. పరిస్థితి కుదుట పడగానే, తాము ఎన్నికల నిర్వహణ పై చెప్తామని, అప్పటి వరకు తరుచూ క-రో-నా వ్యాప్తి పై తాము నివేదికలు అందిస్తూ ఉంటామని ఎన్నికల కమీషనర్ కు తెలిపారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read