కోవిడ్ 19 మరణాలకు సంబంధించి చైనా వెల్లడిస్తున్న సంఖ్యను ప్రపంచం నమ్మడం లేదు. చైనా మృతుల సంఖ్యకు సంబంధించి వాస్తవాల్ని దాచిపెడుతోందన్న సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. చైనాలో గత మూడుమాసాల్లో పెద్ద సంఖ్యలో మొబైల్, ల్యాండ్ లైన్ ఫోన్ల వినియోగం నిల్చిపోయింది. 2019 డిసెంబర్ తో పోలిస్తే 2020 జనవరి నాటికి 2.10 కోట్లకుపైగా మొబైల్ ఫోన్లు ఆగిపోయాయి. 8.40లక్షల ల్యాండ్ లైన్ కనెక్షన్లు రద్దయ్యాయి. ఇది చైనాలో అత్యధిక మరణాల సంఖ్యను సూచిస్తున్నట్లు సందేహిస్తున్నారు. చైనాలో డిజిటలైజేషన్ స్థాయి చాలా ఎక్కువ. ప్రజలు సెల్ ఫోన్ లేకుండా జీవించలేరు. పింఛన్లు, సామాజిక భద్రతా పధకాలో పాటు ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి కార్యక్రమానికి మొబైల్ ఫోన్లో అనుసంధానమౌతుంది. ఆఖరకు షాపింగ్ నుంచి రైలు, బస్సు టికెట్ల కొనుగోలు వరకు అన్నింటికి చైనీయులు మొబైల్ ఫోన్లను వినియోగిస్తారు. అక్కడి ప్రజల రోజు వారి వ్యవహారాల్లో మొబైల్ ఫోన్ ఒక కీలకాంశం. చైనా ప్రభుత్వం కూడా మొబైల్ ఆధారిత సేవలకే ప్రాధాన్యతనిస్తోంది.

అక్కడి ప్రజలంతా ఆరోగ్య కోడ్ను మొబైల్ ఫోన్లలో నిక్షిప్తం చేయాలి. ఆఖరకు మృతి చెందిన సందర్భాల్లో కూడా మృతదేహతరలింపునకు గ్రీన్ హెల్త్ కోడ్ ఆధారంగానే ప్రభుత్వం అనుమతిస్తుంది. అలాంటి చైనాలో ఎవరూ తమంతతాముగా సెల్‌ఫోన్లను రద్దు చేసుకోరు. అందుకెవరూ సాహసించరు. మరణం సంభవించిన సమయంలోనే మొబైల్ ఫోన్ల రద్దుకు ఆస్కారముంటుంది. కానీ గత మూడుమాసాల్లో చైనాలో మొబైల్, ల్యాండ్ ఫోన్ల వినియోగం, రద్దు అనూహ్యంగా పడిపోయింది. 2019 నవంబర్ నాటికి చైనాలో మొత్తం 160,09,57,000 మొబైల్ ఫోన్లు వినియోగంలో ఉండేవి. మార్చి 2020 చివరి నాటికి 157,99,27,000లకు పడిపోయాయి. అంటే 2,10,30,000 మొబైల్ కనెక్షన్లు తగ్గిపోయాయి.నవంబర్ 2019 నాటికి చైనా లో మొత్తం 19,08,30,000ల్యాండ్ లైన్ ఫోన్లుండేవి. మార్చి 2020 చివరినాటికివి 18,99,90,000 లకు పడిపోయాయి.

ఈ నాలుగుమాసాల్లో వీటి సంఖ్య 8.40లక్షలు తగ్గిపో యాయి. చైనాలో అతిపెద్ద మొబైల్ కనెక్షన్‌దార్లు చైనా మొబై ల్, చైనా టెలికామ్ కనెక్షన్లు అనూహ్యంగా పడిపోయాయి. చైనా మొబైల్ ఇది చైనాలో అతిపెద్ద సెల్ నెట్వర్క్ దేశంలోని మొత్తం కనెక్షన్లలో 60శాతం దీనివే. 2019 డిసెంబర్ లో ఈ కంపెనీకి కొత్తగా 37లక్షల ఖతాలు జతయ్యా యి. జనవరి 2020లో 8.62లక్షల ఖాతాలు తగ్గిపోయాయి. ఫిబ్రవరి 2020లో 72లక్షల ఖతాలు రద్దయ్యా యి. మార్చిలో 88లక్షల ఖాతాలు నిల్చిపోయాయి. చైనా టెలికామ్ చైనాలో ఇది రెండో అతిపెద్ద టెలికామ్ నెట్ వర్క్. మొత్తం మార్కెట్లో దీనివాటా 21శాతం. డిసెంబర్ 2019లో ఈ నెట్వ ర్క్ కు కొత్తగా 11.80లక్షల ఖాతాలొచ్చా యి. జనవరి 2020లో 4.30లక్షల ఖాతాల్ని కోల్పోయింది. ఫిబ్రవరి 2020లో 56లక్షల ఖాతాలు తగ్గిపోయాయి. మార్చి 2020లో 71లక్షల ఖాతాల్నిది కోల్పోయింది. చైనాలో ఒక వ్యక్తి తన సెల్ ఫోన్‌ను రద్దు చేయడం అసాధ్యం. కానీ అనూహ్య సంఘటనల నేపధ్యంలోనే ఇలాంటి రద్దులు జరుగుతుంటాయి. చైనా మొబైల్ నెట్ వర్క్ సంస్థలు ప్రకటించిన తాజా సంఖ్యలు ఆదేశంలో కోవిడ్ 19 మరణాలకు సంబంధించి ప్రభుత్వం నిర్దిష్ట సమాచారన్ని ప్రపంచానికందిం చడం లేదన్న సందేహాల్ని బలపరుస్తున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read