తెలుగుదేశం పార్టీ నేత, చింతకాయల విజయ్ పై సిఐడి కేసు పెట్టిన విషయం తెలిసిందే. నాలుగు రోజుల క్రితం, ఏపి సిఐడి అధికారులు, హైదరాబాద్ లో ఉన్న చింతకాయల విజయ్ నివాసానికి వెళ్లి, ఆయన కోసం గాలించి, చిన్న పిల్లలను భయపెట్టిన తీరు, చర్చనీయంసం అయ్యింది. అదే సందర్భంలో, చింతకాయల విజయ్, 6 తేదీ సిఐడి ఆఫీస్ కు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులను ఇంట్లో ఎవరూ లేకపోవటంతో, పని వాళ్ళకు ఇచ్చారు. అయితే ఈ రోజు విజయ్, సిఐడి ఆఫీస్ కు విచారణకు వస్తారా లేదా అనే చర్చ జరిగింది. అయితే 11 గంటల సమయంలో, అనూహ్యంగా విజయ్ తరుపు లాయర్లు, సిఐడి ఆఫీస్ కు చేరుకున్నారు. లోపల ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియలేదు. చివరకు సాయంత్రం 5 గంటల సమయంలో, విజయ్ తరుపు న్యాయవాదులు, బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. తమ క్లైంట్ విజయ్ ఒక లేఖ రాసారని, ఆ లేఖ ఇవ్వటానికి వచ్చామని, అయితే సిఐడి అధికారులు మాత్రం, తమను లోపలకు అనుమతించలేదని చెప్పారు. దీంతో ఆ లేఖను తప్పాల్‌లో ఇచ్చి వచ్చేసినట్టు చెప్పారు. ఆ లేఖలో, తన పై ఏ కేసు నమోదు అయ్యింది, ఎఫ్ఐఆర్ ఏంటి అనేది విజయ్ ప్రశ్నించారు. అలాగే సిఐడి అధికారులు తన నివాసంలోకి అక్రమంగా వచ్చి, తన కూతురుని భయపెట్టారని, డ్రైవర్ పై చేయి చేసుకున్నట్టు తెలిపారు. అలాగే కుటుంబ సభ్యులకు నోటీస్ ఇవ్వలేదు కాబట్టి, ఆ నోటీస్ చెల్లదని లేఖలో రాసారు. ఇది కేవలం తనను భయపెట్టటానికి చేసిన చర్యగా లేఖలో తెలిపారు. కేసు వివరాలు ఇచ్చి, సరైన ఫార్మటులో నోటీస్ ఇస్తే, విచారణకు సహకరిస్తానని లేఖలో తెలిపారు. మరి సిఐడి ఎలా స్పందిస్తుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read