వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణం రాజు అరెస్ట్ పై, సిఐడి అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆయన్ను అరెస్ట్ చేసి ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారా, అసలు 30 మంది మఫ్తీలో వచ్చి అరెస్ట్ చేసారు, వాళ్ళు అసలు పోలీసులేనా అని వాళ్ళ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేసిన నేపధ్యంలో, రఘురామకృష్ణం రాజు అరెస్ట్ పై, సిఐడి అధికారిక ప్రకటన విడుదల చేసింది. నర్సాపురం పార్లమెంట్ సభ్యడు అని రఘురామకృష్ణం రాజుని, ఆయన హైదరాబాద్ నివాసంలో అరెస్ట్ చేసినట్టు చెప్పారు. రఘరామకృష్ణం రాజు కొన్ని వర్గాలను కించపరిచేలా హేట్ స్పీచ్ లు ఇస్తున్నారని తమకు సమాచారం అందింది అని, అది కాకుండా ప్రభుత్వం పై కుట్రలు పన్నుతున్నారని సమాచారం వచ్చిందని తమ అధికారిక ప్రకటనలో సిఐడి తెలిపింది. దీని పై సిఐడి చీఫ్ పీవి సునీల్ కుమార్, ప్రాధమిక విచారణ చేసారని తెలిపారు. ఈ ఎంక్వయిరీలో వచ్చిన సమాచారం కరెక్ట్ అని తేలింది అని, రఘురామకృష్ణం రాజు, రెగ్యులర్ గా, ఒక పధ్ధతి ప్రకారం కొన్ని వర్గాలలో టెన్షన్ వాతవరణం సృష్టిస్తున్నారని, అలాగే ప్రభుత్వ పెద్దల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, ఇది ప్రభుత్వం పై ప్రజల్లో నమ్మకం పోయేలా ఉన్నాయని, ఆయన వ్యాఖ్యలు ప్రజల్లో ప్రభుత్వం, పై నమ్మకం పోయేలా ఉన్నాయని అన్నారు.

cid 14052021 2

ఆయన స్పీచ్లు కావాలని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా ఉన్నాయని అన్నారు. ఆయన ఇలాంటివి ఒక సిరీస్ ప్రకారం చేసారని తెలిపారు. కొన్ని మీడియా చానల్స్ లో కూడా, ఆయన కొన్ని వర్గాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేసారని తెలిపారు. వీటి అన్నిటి నేపధ్యంలో, సిఐడి చీఫ్ సునీల్ కుమార్ ఆదేశాలు ప్రకారం, ఆయన పై, 124ఎ, 153ఎ, 505, 120బీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసినట్టు సిఐడి విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. రఘురామకృష్ణంరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో డిఫర్ అయ్యిందే, ప్రభుత్వం సరిగ్గా పని చేయటం లేదని, ఇప్పుడు ఆ పనులు అన్నీ బయట పెడుతున్నారని, ఆయన్ను అరెస్ట్ చేయటం పై, సామాన్య ప్రజలతో పాటు, విపక్షాలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. కులాల గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడటం, అలాగే బూతులు గురించి, ఎదుటి వాళ్ళ గురించి వైఎస్ఆర్ పార్టీ నేతలు మాట్లాడటం విడ్డురంగా ఉందని, ఇవే కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు మీద పెడితే, 90 శాతం జైల్లోనే ఉంటారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read