ఏపీ సీఐడీని టిడిపిని వేధించే శాఖ‌గా మార్చార‌నే ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్న ఏడీజీ సునీల్ కుమార్ ని స‌ర్కారు స‌డెన్ సీఐడీని త‌ప్పించ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. అయితే ఇటీవ‌లే డిజిపి ర్యాంకు ప్ర‌మోష‌న్ ఇచ్చిన స‌ర్కారు సునీల్ సేవ‌లను మ‌రింతగా వాడుకునేందుకు మ‌రో కీల‌క పోస్టు క‌ట్టబెట్ట‌నుంద‌ని ప్రచారం జరుగుతుంది. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న వేళ ఏ నిర్ణ‌యం తీసుకున్నా డీజీపీ పాత్ర కీలకం కాబట్టి, అదే ద‌ళితుడైన సునీల్ కుమార్ ని డిజిపిగా పెడితే...టిడిపి ఇరుకున ప‌డుతుంద‌నే వ్యూహంలో ఏపీ సీఎం జ‌గ‌న్ రెడ్డి ఉన్నార‌ని ప్ర‌చారం సాగుతోంది. డిజిపి పోస్టులో సునీల్ కుమార్ ని పెట్టి పోలీసుల్ని తాను చెప్పినట్టు వాడుకోవ‌చ్చ‌ని, విప‌క్షం ఆరోపిస్తే ద‌ళిత ఐపీఎస్ ని డిజిపిని చేస్తే టిడిపికి ఇష్టంలేద‌ని కౌంట‌ర్ వేయొచ్చ‌ని ప్లాన్ వేసి ఉండొచ్చని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. మరో పక్క సిఐడిలో సునీల్  కుమార్ నిరంకుశ తీరుకి వ్య‌తిరేకంగా మొత్తం సీఐడీలో ఉన్న‌వాళ్లంతా ఏక‌మ‌య్యార‌ని, అలాగే సిఐఐ వ్యవహరిస్తున్న తీరుతో, ఇప్పటికే కేంద్రానికి అనేక కంప్లైంట్ లు వెళ్ళటం, అలాగే కేంద్రం కూడా సీరియస్ అవ్వటంతో, సునీల్ ని తప్పించారా అనే ప్రచారం జరుగుతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read