పెగసస్‍ వ్యవహరం తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. పెగసస్‍ ని ఉపయోగించి, ప్రతిపక్ష నాయకులూ, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్, అలాగే కొంత మంది విలేఖరుల ఫోన్ ట్యాప్ చేసారు అంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇది కేంద్ర ప్రభుత్వమే చేస్తుంది అంటూ ప్రతిపక్షాలు ఆరోపించాయి. అలాగే పార్లమెంట్ లో కూడా ఇదే వ్యవహారం పై రచ్చ జరుగుతుంది. ఈ నేపధ్యంలో పెగసస్‍ వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది. పెగసస్‍ వ్యవహారానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి అంటూ, సామాజిక కార్యకర్తలతో పాటుగా, కొంత మంది పత్రికాధిపతులు కూడా దీని పై విచారణ జరిపించాలని సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. సీనియర్ జర్నలిస్టు ఎన్.రామ్ కూడా ఈ అంశం పై పిటీషన్ దాఖలు చేసారు. ఆ పిటీషన్ పై ఈ రోజు సుప్రీం కోర్టు విచారణ జరిపింది. ఈ పిటీషన్ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ బెంచ్ ముందుకు వచ్చింది. పిటీషనర్ తరుపున సీనియర్ కౌన్సిల్ కపిల్ సిబల్, జస్టిస్ ఎన్వీ రమణ బెంచ్ ముందు తమ వాదనలు వినిపించారు. పెగసస్‍ వ్యవహరంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని, ఈ పిటీషన్ ను విచారణకు అనుమతించి వాస్తవాలు బయటకు వచ్చేలా, తగు చర్యలు తీసుకోవాలి అంటూ సుప్రీం కోర్టుని కోరారు.

ramana 30072021 1

దీని పై స్పందించిన సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, కచ్చితంగా దీని పైన విచారణ జరుపుతామని, ఈ పిటీషన్ ను అనుమతించి, లిస్టు చేయాలి అంటూ ఆదేశాలు జరీ చేసారు. అయితే సహజంగా ఏ ముఖ్యమైన పిటీషన్ లు అయినా, వాటిని ప్రతి రోజు చీఫ్ జస్టిస్ ముందు పెడతారు. ఈ క్రమంలోనే, ఈ రోజు ఈ పిటీషన్ ను, కపిల్ సిబల్, చీఫ్ జస్టిస్ బెంచ్ ముందు ఈ పిటీషన్ గురించిన వివరాలు చెప్పారు. దీని పై స్పందించిన చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, కచ్చితంగా దీని పైన విచారణ జరుపుతాం అని, దీన్ని లిస్టు చేయాలని కోరారు. ఇది లిస్టు చేసిన తరువాత, ఎప్పుడు విచారణకు వస్తుంది, ఏ బెంచ్ ముందుకు విచారణ వస్తుంది అని తెలిసే అవకాసం ఉంటుంది. అప్పుడు కేంద్రానికి, ఇతర ప్రతివాదులకు నోటీసులు ఇచ్చి, వారి అభిప్రయం కూడా తెలుసుకుంటారు. అయితే ఈ అంశం కేంద్రానికి షాక్ అనే చెప్పాలి. ఈ విషయంలో పార్లమెంట్ లోనే విచారణకు అంగీకరించని కేంద్రానికి, ఇప్పుడు ఇది సుప్రీం కోర్టుకు చేరటంతో, ఈ విషయం పై విచారణ మొదలైతే పెద్ద దెబ్బ అనే చెప్పాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read