రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. 20 రోజుల పాటు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో 25 బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టనుంది. సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని ప్రధాని, పార్లమెంట్ వ్యవహారాల మంత్రి ఆధ్వర్యంలో ఈ రోజు అఖిలపక్ష సమావేశం ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశానికి, తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్, అలాగే వైసీపీ తరుపున పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి కూడా హాజారు అయ్యారు. సమావేశం ముగిసిన తరువాత, గల్లా జయదేవ్ మాట్లాడుతూ, రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ సమస్యల పై ప్రస్తావించామని చెప్పారు. అలాగే దేశంలో ఆర్ధిక పరిస్థితి పై ఆందోళన వ్యక్తం చేసామని, దీని పై సుదీర్ఘ చర్చ జరగాలని కోరామని చెప్పారు. సమావేశాల్లో, ఇతర పార్టీల నేతలకు, ఎక్కువ సమయం కేటాయించాలని, చిన్న పార్టీలు అని విస్మరించవద్దు అని చెప్పామని గల్లా జయదేవ్ అన్నారు.

vsreddy 17112019 2

అలాగే విజయసాయి రెడ్డి మాట్లాడుతూ, బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ ఏపికి ఇవ్వాలని ప్రస్తావించామని చెప్పారు. విభజన హామీలు నేరవేర్చమని కోరామని అన్నారు. మహిళా బిల్లు, బీసీ రిజర్వేషన్లు వంటి అంశాలను కూడా ప్రస్తావించామని చెప్పారు. అయితే ఇది ఇలా ఉండగా, సమావేశం లోపల మాత్రం, విజయసాయి రెడ్డి పై, హోం మంత్రి అమిత్ షా సహా, అఖిలపక్ష్ నేతలు అందరూ అసహనం వ్యక్తం చేసినట్టు, కొన్ని ఛానెల్స్ లో వార్తలు వచ్చాయి. ఆ వార్తలు ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ, చిదంబరానికి, పార్లమెంటు సమావేశాల్లో హాజరు అయ్యేందుకు, బెయిల్ తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ కాంగ్రెస్ నేతలు, కోరిన సమయంలో, విజయసాయి రెడ్డి జోక్యం చేసుకుని, కాంగ్రెస్ ద్వంద ప్రమాణాలంటూ జగన్ జైలు శిక్ష అంశాన్ని ప్రస్తావించారని ఆ కధనంలో చెప్పారు.

vsreddy 17112019 3

అయితే కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్న సమయంలో, విజయసాయి రెడ్డి జోక్యం చేసుకోవటం, పై హోం మంత్రి అమిత్ షా అసహనం వ్యక్తం చేస్తూ, కాంగ్రెస్ అడగాల్సింది అడిగింది, మేము నోట్ చేసుకున్నాం, మధ్యలో మీకు వచ్చిన ఇబ్బందేంటని, దీనిపై మీరెందుకు చర్చ పెడుతున్నారు... మీకు సంభందం లేని విషయంలో మీరెందుకు స్పందిస్తున్నారని, విజయసాయి రెడ్డిని ప్రశ్నించినట్టు సమాచారం. ఇదే సమయంలో, జగన్ జిలు జీవితాన్ని, చిదంబరంకు ఎలా ముడిపెడతారని కాంగ్రెస్ నేతలు కూడా విజయసాయి రెడ్డిని ప్రశ్నించారు. అనవసరమైన, సంభంధంలేని విషయంపై చర్చకు ఎందుకు వస్తున్నారని, టికే రంగరాజన్, ఎంకే ప్రేమ్ చంద్రన్, ఇతర సభ్యులు కూడా విజయసాయి రెడ్డిని నిలదీశారు. అఖిలపక్షానికి ఉండే ప్రాధాన్యత తెలుసుకోవాలని, దానికి అనుగుణంగా ప్రవర్తించాలని హితవుపలికినట్లు సమాచారం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read