చంద్రబాబు నివాసం పై అతి పెద్ద కుట్ర జరిగిందా ? అసలు ఏమి సాధించటం కోసం ఇలా ప్లాన్ చేసారు ? కేవలం చంద్రబాబుని అల్లరి చెయ్యటం కోసమా ? లేక నిజంగా ఏదైనా కుట్ర ఉందా ? ఈ రోజు చంద్రబాబు ఉండవల్లి నివాసం దగ్గర అలజడి రేగింది. చంద్రబాబు చెయ్యి నొప్పి కారణంగా, హైదరాబాద్ లో చికిత్స తీసుకుంటున్న వేళ, ఆయన నివాసం దగ్గర సెక్యూరిటీ వాళ్ళు, కొంత మంది తెలుగుదేశం నేతలు ఉన్నారు. అయితే ఈ సమయంలో వారికి కొంత మంది అనుమానాస్పదంగా తిరగటం కనిపించింది. వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద బాక్స్ లు కూడా ఉన్నాయి. అయితే వారు మాత్రం చంద్రబాబు సెక్యూరిటీ దగ్గర ఏ విధమైన పర్మిషన్ తీసుకోకుండా, అక్కడకు వచ్చి డ్రోన్ లు పైకి లేపారు. అయితే ఎందుకు ఇలా చేస్తున్నారు అని నిలదీసిన వినలేదు, దీంతో అక్కడ చంద్రబాబు సెక్యూరిటీ సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నారు.

cbn 16082019 2

ఈ నేపధ్యంలో అక్కడే ఉన్న తెలుగుదేశం నేతలు, మీరు ఎవరు, ఇక్కడకు ఎందుకు వచ్చారు, పర్మిషన్ ఏది అని అడిగినా వారి వద్ద సమాధానం లేదు. మేము డ్రోన్ వీడియోలు తీస్తామని, నిన్న స్వతంత్ర దినోత్సవ వేడుకలు కూడా మేమే తీసామని, జగన్ అన్న పంపించాడని ఒకసారి, కాదు కాదు, జగన్ అన్న దగ్గర ఉండే కిరణ్ అన్న పంపించాడు అని మరోసారి చెప్పారు. దీనికి సంబందించిన వీడియో కూడా బయటకు వచ్చింది. అయితే ఈ కిరణ్ ఎవరు అనేది మాత్రం ఎవరికీ తెలియటం లేదు. మరో పక్క విషయం తెలియటంతో, పోలీసులు వచ్చి, అతన్ని మేము విచారణ చేస్తాం అని తీసుకు వెళ్తున్న టైంలో, తెలుగుదేశం నేతలు అడ్డు పడ్డారు. అసలు వాళ్ళు ఎవరు, ఎందుకు ఇక్కడకు వచ్చారో, ఇవన్నీ చెప్పకుండా, మీరు తీసుకువెళ్లటానికి వీలు లేదని ఆందోళన చేసారు.

cbn 16082019 3

అయితే, కొద్ది సేపటి తరువాత, వాళ్ళు మా వాల్లే అంటూ జలవనరుల శాఖ అధికారులు చెప్పారు. వరద అంచనా కోసం మేమే పంపించామని చెప్పారు. అయితే, వాళ్ళని ఐడి కార్డులు అడిగితె మాత్రం లేవు అని చెప్పారు. ఇక మరో పక్క ఆ వీడియో కేవలం చంద్రబాబు ఇంటి వద్ద మాత్రమే ఎందుకు తీస్తున్నారు ? మిగతా చోట్ల ఎందుకు తీయటం లేదు అనే ప్రశ్నకు సమాధానం లేదు. చంద్రబాబు ఎన్ఎస్జీ భద్రతలో ఉంటారు. ఆయన నివాసం మీద డ్రోన్ లేపే ముందు, ఎన్ఎస్జీ పర్మిషన్ తీసుకున్నారా అనే ప్రశ్నకు కూడా సమాధానం లేదు. అయితే ఇది కుట్ర కోణమా ? లేక చంద్రబాబు ఇంటి వద్ద వరదను పెద్దదిగా చూపించి, పైశాచిక ఆనందం పొందే కుట్రా అనేది కూడా తెలియాల్సి ఉంది. పోలీసులు సరైన విధంగా వివరాలు చెప్పాల్సిన అవసరం ఉంది.

Advertisements

Add comment


Security code
Refresh

Advertisements

Latest Articles

Most Read