రాజధాని అమరావతి ప్రాంతంలో, తాడికొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఉండవల్లి శ్రీదేవి పై సొంత పార్టీ నేత ఆరోపణలు చేస్తూ, ఒక సేల్ఫీ వీడియో విడుదల చేయటం సంచలంగా మారింది. గత మూడు నాలుగు రోజులుగా, ఇదే అంశం పై సోషల్ మీడియాలో కధనాలు వస్తున్నా, అవి ఎలాంటి వార్తలో అని ఎవరూ నమ్మలేదు. అయితే ఈ రోజు వైసీపీ నేత మేకల రవి, తన ఆవేదన చెప్తూ, సేల్ఫీ వీడియో విడుదల చేసారు. తన వద్ద ఎమ్మెల్యే, రూ.1.40 కోట్లు తీసుకున్నారని, 40 లక్షలు మాత్రమే తిరిగి ఇచ్చారని, మిగతా 80 లక్షలు అడుగుంటే, డీసీఎంఎస్ డైరెక్టర్ పదవి తీసుకున్నావ్ కదా, దానికి సరిపోయింది అంటూ ఎమ్మెల్యే బెదిరిస్తున్నారని, డబ్బులు అడుగుంటే, పోలీసులుకు చెప్పి అరెస్ట్ చేపిస్తాను అంటూ, బెదిరిస్తున్నారని, ఈ విషయం పై జగన్ మోహన్ రెడ్డి గారు కలుగు చేసుకుని తనకు న్యాయం చెయ్యాలి అంటూ, మేకల రవి తన అవేదన వ్యకం చేసారు. అయితే ఈ సేల్ఫీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు, మీడియాలో కూడా ప్రముఖంగా ప్రచారం అవుతుంది. అయితే దీని పై ఇప్పటి వరకు ఎమ్మెల్యే శ్రీదేవి గారు స్పందించ లేదు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read