ఆంధ్రప్రదేశ్ సిఐడి అడిషనల్ డీజీగా ఉన్న పీవీ సునీల్ కుమార్ కు షాక్ ఇస్తూ, ఘాటైన విమర్శలు, ఆరోపణలు చేసారు, మహరాష్ట్రకు చెందిన లీగల్ రైట్స్ అడ్వైజరీ కన్వీనర్ ఎన్‍ఐ జోషి. ఎన్‍ఐ జోషి కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ కు, సునీల్ కుమార్ పై ఫిర్యాదు చేస్తూ ఆరు పేజీల లేఖ రాసారు. ఆ ఆరు పేజిలలో సునీల్ కుమార్ ఇవి చేస్తున్నారు అంటూ, ఆయన చేస్తున్న పనులు వివరించారు. సునీల్ కుమార్ పోలీస్ రూల్స్, సర్వీస్ రూల్స్ కి వ్యతిరేకంగా ఆయన చేస్తున్న పనులు పై ఫిర్యాదు చేసారు. 1864 సివిల్ సర్వీసెస్ రూల్స్ కి వ్యతిరేకంగా, పోలీస్ ఫోర్సెస్ ఆక్ట్ కి వ్యతిరేకంగా సునీల్ కుమార్ వ్యావహరిస్తున్నారు అంటూ, ఆయన పై ఏడు ఫిర్యాదులు చేసారు. ఆ ఏడు ఫిర్యాదుల్లో ప్రధానమైనది, అంబేద్కర్ ఇండియా మిషన్ పేరుతో, ఆయన చేస్తున్న కార్యక్రమాల గురించి వివరించారు. ఒక సర్వీస్ లో ఉన్నప్పుడు, ఐపిఎస్ గా ఉన్నప్పుడు, ఒక సంస్థ లాంటివి ఏవి ప్రారంభించకూడదని, ఇది సర్వీస్ రూల్స్ కి వ్యతిరేకం అని. అంబేద్కర్ ఇండియా మిషన్ పేరుతో ఆయన వ్యక్తిగతంగా అది ప్రారంభించారని తెలిపారు. ఈ సంస్థ ద్వారా షడ్యుల్ కేస్ట్ వారిని ప్రభావితం చేస్తున్నారని, హిందువులు పైన వారిని రె-చ్చ-గో-డు-తు-న్నా-ర-ని, మ-త వి-ద్వే-షా-లు రె-చ్చ-గొ-ట్టే విధంగా ఆయన అనేక సార్లు ప్రసంగాలు చేసారని ఫిర్యాదులో తెలిపారు.

sunil 09062021 2

దేవాలయాల పైన కూడా ఆయన తీవ్రమైన పదజాలంతో విమర్శలు గుప్పించారని తెలిపారు. మరో పక్క ఒక రాజకీయ ఐడియాలజీని రుద్దుతూ విమర్శలు చేస్తున్నారని కూడా ఫిర్యాదులో తెలిపారు. రాజ్యంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ మతం పైన చేసిన వ్యాఖ్యలను తనకు అనుకూలంగా మిస్ కోట్ చేసి ప్రజల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారని. షడ్యుల్ కేస్ట్ కి సంబంధించి ఒక ప్రత్యేకమైన ఐడియాలజీ ఉండాలి అంటూ ప్రోమోట్ చేస్తున్నారని, కులాలని కూడా రెచ్చగోడుతున్నారని ఫిర్యాదులు తెలిపారు. ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలను కూడా విమర్శలు చేస్తూ ప్రసంగాలు చేస్తున్నారని తెలిపారు. వీటి అన్నిటి పై ఆధారాలు ఇచ్చారు. ఈ మొత్తం పైన ఆయన పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే సెక్షన్ 153(ఏ), 295(ఏ) ప్రకారం సునీల్ కుమార్ పై కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో తెలిపారు. ఈ మొత్తం వ్యవహారం పై కేంద్ర హోం శాఖకు లీగల్ రైట్స్ అడ్వైజరీ కన్వీనర్ ఎన్‍ఐ జోషి లేఖ రాసారు. మరి దీని పై సునీల్ కుమార్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read