అది 30 ఏళ్ళు రాజశేఖర్ రెడ్డిని మోసిన పార్టీ. రెండు సార్లు రాజశేఖర్ రెడ్డిని సియం చేసిన పార్టీ. జగన్ మోహన్ రెడ్డి రాజకీయ అరంగేట్రం చేసిన పార్టీ. జగన్ ని ఎంపీని చేసిన పార్టీ. రాహుల్ గాంధీకి 42 ఎంపీ సీట్లు గెలిచి, మా నాన్న చివరి కోరిన తీరుస్తా అని జగన్ చెప్పారు. తరువాత జగన్ విబేధించిన బయటకు వచ్చారు అనుకోండి. అలాంటి పార్టీని పట్టుకుని నిండు సభలో విజయసాయి రెడ్డి దళారీ పార్టీ అంటూ కాంగ్రెస్ పార్టీ పై విరుచుకు పడ్డారు. ఆదివారం, రైతు బిల్లులు పై చర్చ సందర్భంలో, వైసీపీ పార్టీ పూర్తిగా బీజేపీకి మద్దతు ప్రకటించింది. విపక్ష పార్టీలు అన్నీ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడాయి. తెలుగుదేశం పార్టీ కూడా రైతు బిల్లు పై అభ్యంతరం చెప్పింది. అయితే వైసీపీ మాత్రం, ఎలాంటి షరతులు లేకుండా, భేషరతుగా మద్దతు పలికింది. ఈ బిల్లుని పూర్తిగా మద్దతు ఇస్తున్నాం అంటూ విజయసాయి రెడ్డి రాజ్యసభలో ప్రకటించారు. తన ఉపన్యాసం అంతా చెప్పిన తరువాత, చివరలో ఈ బిల్లుని వ్యతిరేకించింది, కేవలం దళారులే అని అన్నారు. అలాంటి దళారులకు మద్దతు తెలుపుతున్న కాంగ్రెస్ పార్టీ కూడా ఒక దళారి పార్టీ అంటూ విరుచుకు పడ్డారు.

బీజేపీ కంటే, ఎక్కువగా వైసీపీ కాంగ్రెస్ ని తిట్టటంతో అందరూ అవాక్కయ్యారు. వీళ్ళు బీజేపీ మిత్రపక్షం కాదు కదా అంటూ ఆశ్చర్యపోయారు. అయితే విజయసాయి రెడ్డి వ్యాఖ్యల పై కాంగ్రెస్ పార్టీ సభలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఆనందశర్మ తీవ్రంగా స్పందించారు. ఆ సభ్యుడి ప్రవర్త, మాట తీవ్ర అభ్యంతరకరం అని, ఆ సభ్యడు క్షమాపణ చెప్పాలని కోరారు. మీ ప్రవర్త, వ్యక్తిత్వం అన్నీ మాటకు తెలుసు, మీరు అవినీతి చేసి జైలుకు వెళ్లి వచ్చి బెయిల్ పై ఉన్నారు, మీరు బెయిల్ కు అర్హులు కాదు అంటూ విరుచుకు పడ్డారు. మరో సీనియర్ నేత గులాంనబీ ఆజాద్‌ మాట్లాడుతూ, మీ చరిత్ర అంతా మాకు తెలుసు, మిమ్మల్ని మళ్ళీ ఆ స్థానానికే పంపుతాం, మీరు బీజేపీకి ఎందుకు మద్దతు పలుకుతున్నారో మాకు తెలుసు, సిగ్గుపడండి అంటూ విజయసాయి రెడ్డి పై విరుచుకు పడ్డారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read