ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గత మూడు రోజులుగా పెరుగుతూనే ఉంది. నిన్న 24 గంటల్లోనే, కొత్తగా 67 కేసులు వచ్చిన సంగతి తెలిసిందే. బుధవారం రాత్రి వరకు 111 కేసులు ఉనంట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇప్పుడు, ఈ రోజు తాజాగా విడుదల చేసిన బులిటెన్ లో, 21 కొత్త కేసులతో కలిపి మొత్తం బాధితుల సంఖ్య 132 కు చేరింది. నిన్న రాత్రి పది గంటల నుంచి, ఈ రోజు ఉదయం పది గంటల వరకు, మొత్తంగా 21 కేసులు పోజిటివ్ గా తేలాయి. మొత్తంగా ఇప్పటి వరకు, 1800 టెస్ట్ లు చేసారు. 132 పోజిటివ్ రాగా, 1175 నెగెటివ్ వచ్చాయి. ఇంకా 493 రిజల్ట్స్ రావాల్సి ఉంది. ముఖ్యంగా, ఢిల్లీలోని ఒక సభకు వెళ్లి వచ్చిన వారు, ఎక్కువగా ఈ కరోనా పోజిటివ్ బారిన పడుతున్నారు. వారు వారి సన్నిహితులు, బంధవులలో కూడా, ఈ లక్ష్యనాలు కనిపిస్తున్నాయి. వీరి వల్లే, ఇన్ని కేసులు వచ్చాయని, నిన్న జగన్ చెప్పిన సంగతి కూడా తెలిసిందే. వారి అందరినీ ప్రభుత్వం ముందుకు వచ్చి, టెస్ట్ లు చేసుకోవాలని, జగన్ కోరిన విషయం కూడా తెలిసిందే.

ఇప్పటి వరకు గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో, ఒక్కో జిల్లాల్లో, 20 కేసులతో, అత్యధికంగా కరోనా నిర్ధరణ అయింది. రాష్ట్రంలో బుధవారం రాత్రి 10 నుంచి గురువారం ఉదయం 10 వరకు 21 పాజిటివ్ కేసులు వచ్చాయి. ఇప్పటివరకు మొత్తం 1800 మందికి పరీక్షలు నిర్వహించగా, 132 కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఢిల్లీ నుంచి వచ్చిన వారిలో, కర్నూల్ లో ఎక్కువ మంది, తరువాత అనంతపురంలో ఎక్కువ మంది ఉన్నారు. అయితే ఇప్పటి వరకు, కర్నూల్ లో, కేవలం 61 మందిని మాత్రమే టెస్ట్ చేసారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు, కర్నూల్ లో, 189 మంది ఉన్నారని, రెండు రోజుల క్రితం, ప్రభుత్వం విడుదల చేసిన లెక్కల్లో తేలింది. ఇంకా వీరిలో, దాదాపుగా 120 మందికి టెస్టింగ్ చెయ్యాల్సి ఉంది.

ఇక ఈ రోజు బులిటెన్ చూస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో, 11 జిల్లాల్లో కరోనా కేసులు వచ్చాయి. విజయనగరం, శ్రీకాకుళంలో, ఇప్పటి వరకు ఒక్క కరోనా పోజిటివ్ కేసు కూడా లేకపోవటంతో, అక్కడ యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. అయినా అపత్రమత్తంగానే ఉన్నారు. ఇక అనంతపురంలో, 153 మందిని టెస్ట్ చేస్తే, 2 పోజిటివ్ వచ్చాయి. అలాగే, చిత్తూరులో, 93 మందిని టెస్ట్ చేస్తే, 8 పోజిటివ్ వచ్చాయి. తూర్పు గోదావరిలో, 229 మందిని టెస్ట్ చేస్తే, 9 పోజిటివ్ వచ్చాయి. గుంటూరులో, 302 మందిని టెస్ట్ చేస్తే, 20 పోజిటివ్ వచ్చాయి. కడపలో, 174 మందిని టెస్ట్ చేస్తే, 15 పోజిటివ్ వచ్చాయి. కృష్ణాలో, 47 మందిని టెస్ట్ చేస్తే, 15 పోజిటివ్ వచ్చాయి. కర్నూల్ లో, 61 మందిని టెస్ట్ చేస్తే, 1 పోజిటివ్ వచ్చాయి. నెల్లూరులో, 253 మందిని టెస్ట్ చేస్తే, 20 పోజిటివ్ వచ్చాయి. ప్రకాశంలో, 133 మందిని టెస్ట్ చేస్తే, 17 పోజిటివ్ వచ్చాయి. విశాఖలో, 202 మందిని టెస్ట్ చేస్తే, 11 పోజిటివ్ వచ్చాయి. ఇక పశ్చిమ గోదావరిలో, 96 మందిని టెస్ట్ చేస్తే, 14 పోజిటివ్ వచ్చాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read