శాసనమండలిని రద్దు చేస్తాం, మీ ఎమ్మెల్సీలు ఇంకా రెండు, నుంచి మూడేళ్ళు ఉన్నాయి, ఇప్పుడే పోతాయి అంటూ, ప్రభుత్వం ఎంత బెదిరిస్తున్నా, ఎమ్మెల్సీలు లెక్క చెయ్యటం లేదు. అలాగే మండలి చైర్మెన్ షరీఫ్ ని, వైసీపీ పార్టీ మొత్తం టార్గెట్ చేస్తుంది. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలే కాదు, ఏకంగా జగన్ మోహన్ రెడ్డి కూడా, షరీఫ్ ని టార్గెట్ చేసారు. ఎప్పుడూ లేని విధంగా, ఒక స్పీకర్ నిర్ణయాన్ని, మరో సభలో చర్చించి, ఆయన్ను కించ పరచటమే కాక, అసలు ఆ సభనే అవమాన పరిచారు. ఆ సభ అనవసరం అని, అసెంబ్లీలోనే అనేక మంది మేధావులు ఉన్నారని చెప్పారు. ఇలా శాసనమండలిని టార్గెట్ చేసారు. ఇక శాసనమండలి చైర్మెన్ షరీఫ్ ని అయితే, టార్గెట్ చేస్తూనే ఉన్నారు. మంత్రులు సభలోనే, ఆయన పై దుషించారని, అనరాని మాటలు అన్నారని, బెదిరించారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ప్రభుత్వం, ఏకంగా మండలినే రద్దు చేస్తాం అంటూ, బెదిరిస్తుంది. రేపు నిర్ణయం తీసుకుంటామని, రేపు క్యాబినెట్ పెట్టి, క్యాబినెట్ లో తీర్మానం చేసి, రేపు అసెంబ్లీలో బిల్లు పెట్టి, మండలిని రద్దు చేస్తాం అంటుంది.

sharif 260120220 12

అయితే ప్రభుత్వం ఎన్ని ఒత్తిడులు పెడుతున్నా, ఏకంగా మండలి చైర్మెన్ ని టార్గెట్ చేసినా, చైర్మెన్ షరీఫ్ మాత్రం, బెదరటం లేదు కదా, మరింత దూకుడుగా వెళ్తున్నారు. ఆయన సహజ శైలిలోనే, కూల్ గా ఉంటూనే, చెయ్యల్సింది చేసేస్తున్నారు. ఇప్పటికే తనకు ఉన్న విచక్షణాదికారంతో, వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుని సెలెక్ట్ కమిటీకి పంపిన షరీఫ్, ఇప్పుడు మరో దూకుడు నిర్ణయం తీసుకున్నారు. సెలెక్ట్ కమిటీకి మెంబెర్స్ పేర్లు ఇవ్వాలి అంటూ, అన్ని పార్టీల, విప్‌లకు మండలి చైర్మన్ షరీఫ్ లేఖలు రాసారు. సెలెక్ట్ కమిటీలో ఎవరు ఉంటారో చెప్పాలి అంటూ, అన్ని పార్టీలను కోరారు. అటు సీఆర్డీఏ బిల్లు, ఇటు వికేంద్రీకరణ బిల్లుకు విడివిడిగా సెలెక్ట్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు.

sharif 260120220 3

ఇందులో, ఒక్కో సెలెక్ట్ కమిటీలో మొత్తం, 9 మంది సభ్యులు ఉంటారు. తెలుగుదేశం పార్టీకి 5 మంది, వైసీపీ, పీడీఎఫ్, బీజేపీ నుంచి ఒక్కో సభ్యుడు ఈ కమిటీలో ఉంటారు. కమిటీ చైర్మెన్ గా, ఆ శాఖా మంత్రి ఉంటారు. వికేంద్రీకరణ బిల్లుకు బుగ్గన, సీఆర్డీఏ రద్దు బిల్లుకు బొత్సా చైర్మెన్ గా ఉండే అవకాసం ఉంది. ఇక మరో పక్క, ఈ రోజు మండలి చైర్మెన్ షరీఫ్, గవర్నర్ ని కలిసారు. గవర్నర్ రమ్మని కోరటంతో, ఆయన వెళ్లినట్టు తెలుస్తుంది. గవర్నర్ తో భేటీ అనంతరం, షరీఫ్ మీడియాతో మాట్లాడారు. తనను దూషించటం గురించి తాను పట్టించుకొనని అన్నారు. రూల్స్ కి వ్యతిరేకంగా తాను ఏ నిర్ణయం కూడా తీసుకోలేదని అన్నారు. నియమ నిబంధనలకు లోబడే తాను నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. మండలి రద్దు పై, తాను ఏమి స్పండించనని అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read