ఇప్పటికే మండలిలో జరిగిన పరిణామాల పై, వైసీపీ ప్రభుత్వం కిందా మీదా పడుతుంది. తన మాట వినని మండలిని రద్దు చేస్తాను అంటూ, జగన్ ఇప్పటికే చెప్పారు కూడా. మూడు రాజధానుల బిల్లు, సెలెక్ట్ కమిటీకి వెళ్ళటంతో, ఈ ప్రక్రియ మూడు నెలలు అవుతుందని, అయితే అంతకంటే ముందుగానే, ఈ రిపోర్ట్ తెప్పించుకోవాలని ప్రభుత్వం చూస్తుంది. అయితే, ఇది మరింత ఆలస్యం అయ్యే అవకాసం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు అసలు కమిటీకి పంపటం కూడా పూర్తీ కాలేదు. అక్కడ నుంచి కమిటీ వెయ్యాలి. అక్కడ నుంచి మూడు నెలలు పట్టే అవకాసం ఉంది. దీని పై నిన్న మండలి చైర్మెన్ మాట్లాడారు. మండలిలో ప్రవేశపెట్టిన బిల్లుల్ని సెలక్ట్ కమిటీకి పంపడం సాంకేతికంగా పూర్తి కాలేదని మండలి చైర్మన్‌షరీఫ్ స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ మధ్యలోనే నిల్చిపోయిందన్నారు. ప్రక్రియ పూర్తయితేనే బిల్లులు సెలక్ట్ కమిటీకి చేరతాయన్నారు. గురువారం పశ్చిమ గోదావరి జిల్లాలో షరీఫ్ పర్యటించారు. తణుకులో తనను కలసిన విలేకరులతో మాట్లాడారు.

chairman 2401220 2

మండలి రద్దు దిశగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై వ్యాఖ్యానించేందుకు షరీఫ్ నిరాకరించారు. అది ప్రభుత్వ ఇష్టమంటూ పేర్కొన్నారు. అలాగే బుధవారం మండలిలో చర్చ సందర్భంగా కొందరు మంత్రులు తనపై దుర్భాషలాడారంటూ వస్తున్న వ్యాఖ్యలు కూడా సరికావన్నారు. ఎవరెవరో ఏదేదో అన్నారు.. అయితే ఎవరేం అన్నారో తనకు తెలీదన్నారు. సహజంగా ఉద్రేకపడ్డ సమయంలో కోపమొస్తుంది.. అలాంటి సమయంలో కొన్ని పదాలు నోటినుండి వెలువడతాయి. అంతమాత్రాన వాటిని ఉద్దేశపూర్వకంగా వినియోగించినట్లు కాదంటూ పేర్కొన్నారు. మూడు రాజధానుల అంశంపై తాను వ్యాఖ్యానించేది లేదన్నారు. బిల్లుల్లో కొన్ని పొరపాట్లున్నందున పరిశీలించాల్సిందిగా కోరేందుకే సెలెక్ట్ కమిటీకి పంపించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

chairman 2401220 3

ఇందుకు తన విచక్షణాధికారాన్ని వినియోగించానన్నారు. అయితే సాంకేతికంగా ప్రక్రియ పూర్తికాలేదన్నారు. నరసాపురంలో సత్కారం.. ఓ ప్రవేటు కార్యక్ర మంలో పాల్గొనేందుకు గురువారం నరసాపురం పట్టణానికి విచ్చేసిన రాష్ట్ర శాసనమండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ ను అమరావతి పరిరక్షణ కమిటీ జేఏసీ నాయకులు సత్కరించారు. స్థానిక మున్సిపల్ అతిథిగృహంలో మండలి చైర్మన్ షరీఫ్ ను నాయకులు పూలమాలలతో ముంచెత్తారు. ఆయనకు శాలువా కప్పి పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు మాట్లాడుతూ 5 కోట్ల ఆంధ్రుల అభీష్టానికి ఆశలకు విలువ నివ్వడంతో పాటు ప్రజాస్వామ్య విలువలను కాపాడిన మండలి చైర్మన్ షరీఫ్ ధర్మానికి బాసటగా నిలిచారని కొని యాడారు. కార్యక్రమంలో అమరావతి పరిరక్షణ కమిటీ జేఏసీ నాయకులు కొప్పాడ రవి, ఆరేటి మృత్యుంజయ, నెక్కంటి క్రాంతికుమార్, బొమ్మిడి రవిశ్రీనివాస్, పొన్నాల నాగబాబు, కొల్లు పెద్దిరాజు, కాగిత వెంకటేశ్వరరావు, భూపతి నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read