ఈ రోజు శుక్రవారం కావటంతో, జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల పై హైదరాబాద్ లో ఉన్న నాంపల్లి సిబిఐ కోర్ట్ లో, విచారణ జరిగింది. అయితే, ఈ రోజు కూడా జగన్ మోహన్ రెడ్డి, తను హాజరు కాకుండా, అధికారిక కార్యక్రమాలు ఉన్నాయని చెప్పి, అబ్సెంట్ పిటీషన్ ధాఖలు చేసారు. దీంతో, జగన్ మోహన్ రెడ్డికి, ఈ ఒక్క వారానికి, సిబిఐ కోర్ట్ మినహాయింపు వచ్చింది. మరో పక్క, ఏ2గా ఉన్న విజయసాయి రెడ్డితో పాటుగా, మిగతా వారు కూడా ఈ విచారణకు హాజరు అయ్యారు. అయితే, ఈ రోజు, కోర్ట్ ఒక కీలక తీర్పు ఇచ్చింది. గత నెల 10న, జగన్ మోహన్ రెడ్డి, సిబిఐ కోర్ట్ కు హాజరయిన సందర్భంలో, ఈడీ కేసుల్లో తనకు వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలని, తన బదులుగా, జగతీ పబ్లికేషన్స్ ప్రతినిధి వస్తారని, చెప్పారు. అయితే ఈ పిటీషన్ పై ఈడీ తన వాదనలు వినిపిస్తూ, జగన్ మోహన్ రెడ్డికి మినహాయింపు ఇవ్వకూడదు అంటూ వాదనలు వినిపించింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్ట్, తీర్పుని, ఈ రోజు అంటే, జనవరి 24కు వాయిదా వేసింది.

jagan 24012020 2

ఈ తరుణంలో, ఈ రోజు కోర్ట్ ఏమి తీర్పు ఇస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూసారు. జగన్ మోహన్ రెడ్డి , ఈడీ కేసుల్లో తనకు వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలి అని వేసిన పిటీషన్ పై, ఈ రోజు కోర్ట్ స్పందిస్తూ, ఆ పిటీషన్ కొట్టేసింది. ప్రతి శుక్రవారం ఈడీ కేసుల్లో విచారణకు హాజరు కావాల్సిందే అని చెప్పింది. దీంతో వైసీపీ శ్రేణులు డీలా పడ్డాయి. అయితే ఇది జగన్ మోహన్ రెడ్డికి పెద్ద ఎదురు దెబ్బగానే చెప్పచ్చు. ఇప్పటి వరకు, ప్రతి శుక్రవారం, సిబిఐ కేసులు మీదే జగన్ విచారణకు వెళ్తున్నారు. అయితే దీని పై కూడా కోర్ట్ మొన్న ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇలా అయితే, కేసులు ఎప్పటికి పూర్తవుతాయి, మీరు రావల్సిందే అని చెప్పటంతో, జగన్ మోహన్ రెడ్డి, గత నెల 10న కోర్ట్ కు హాజరు అయ్యారు.

jagan 24012020 3

ఇప్పుడు, ప్రతి శుక్రవారం, ఈడీ కేసుల్లో కూడా జగన్, కోర్ట్ కు వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పటికే సిబిఐ కేసుల్లో విచారణ ఎదుర్కుంటున్న జగన్, ఇప్పుడు ఈడీ కేసుల్లో కూడా కోర్ట్ కు వెళ్ళాలి. దీంతో, ఇది పెద్ద ఇబ్బందికర పరిణామంగా మారింది. ఈ రోజు కోర్ట్ తీర్పు ఇవ్వటంతో, వచ్చే వాయిదాకి జగన్ రావాల్సి ఉంటుందని చెప్తున్నారు. అయితే జగన్ లాయర్లు, వచ్చే వారినికి కూడా అబసేంట్ పిటీషన్ వెయ్యటానికి చూస్తున్నారని తెలుస్తుంది. అయితే, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ, ఇలా సిబిఐ కేసుల్లో, ఈడీ కేసుల్లో కోర్ట్ కు వెళ్ళటం, జగన్ ఇమేజ్ కు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇమేజ్ కు కూడా మచ్చ అనే చెప్పాలి. మరో పక్క, రాజకీయంగా కూడా వైసీపీకి ఈ పరిణామం, పంటి కింద రాయలా కొనసాగుతూనే ఉంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read