సిపిఐ, సిపిఎం పార్టీలు గత నాలుగు ఐదు నెలలుగా, పవన్ కళ్యాణ్ తో కలిసి నడుస్తున్నాయి. ఆంధ్రాలో ఎక్కువగా టచ్ లో ఉన్నాయి. తెలంగాణాలో కూడా మొన్నటి వరకు సానుకూలంగానే ఉన్నారు. అయితే, పవన్ కళ్యాణ్, మోడీ పై ప్రేమ చూపిస్తూ, సీరియస్-నెస్ లేని రాజకీయం చేస్తూ ఉండటంతో, సిపిఐ పార్టీ తెలంగాణాలో నమస్కారం చెప్పేసింది. తెలుగుదేశం పై వెళ్ళటానికి నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా పవన్ కళ్యాణ్, కెసిఆర్, మోడీకి అనుకూలంగా ఉండటంతో, ఈ నిర్ణయం తీసుకుంది. మరో పక్క సిపిఎం మాత్రం, ప్రస్తుతానికి పవన్ తోనే వెళ్ళటానికి డిసైడ్ అయ్యిందిఅనుకుంటున్న టైంలో, ఈ రోజు సిపియం కూడా పవన్ వైఖరితో విసుగు చెందింది.

cpm 14092018 1

ఈ రోజు తెలంగాణా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, తెలంగాణా ఎన్నికలు, పొత్తుల పై మీడియాతో మాట్లాడారు. మేము జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళటానికి చర్చలు జరిపాము. జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీలో మాతో పొత్తు పై మాట్లాడుకుని, పవన్ మమ్మల్ని పిలుస్తారని చెప్పారు. అయితే రోజులు గడుస్తున్నా మమ్మల్ని పిలవటం లేదు. టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా పనిచేసే విషయంలో జనసేనకు అభ్యంతరాలున్నాయేమో అని తమ్మినేని వీరభద్రం సందేహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్‌తో భేటీ కోసం నాలుగైదు రోజులుగా ప్రయత్నిస్తున్నా, ఆయనకు ఆరోగ్యం బాగాలేదని జనసేన ప్రతినిధులు చెప్తున్నారని తెలిపారు.

cpm 14092018 1

రాజకీయ విధానాలు నచ్చకపోతే జనసేన తమతో కలిసి రాకపోవచ్చునని చెప్పారు. పవన్ కళ్యాణ్ సహా వివిధ పార్టీలతో ఇంకా చర్చలు జరుపుతామని, ఎవరూ రాకపోతే, అభ్యర్థులను ప్రకటిస్తామని తమ్మినేని స్పష్టం చేశారు. మొత్తానికి పవన్ కళ్యాణ్, కెసిఆర్ కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అంటూ, వారం రోజుల క్రిందట తెలంగాణా సిపిఐ ప్రకటించి, మహా కూటమిలో చేరింది. ఈ రోజు, సిపీఎం కూడా, పవన్ కళ్యాణ్, కెసిఆర్ కు వ్యతిరేకంగా పని చెయ్యటానికి సిద్ధంగా లేరు అంటూ, సందేహం వ్యక్తం చేసింది. మొత్తానికి, పవన్ విషయంలో అందరికీ క్లారిటీ వస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా సిపిఐ, సిపిఎం, పవన్, మోడీకి ఎలా సహకరిస్తున్నారో తెలుసుకునే రోజు కూడా తొందరలోనే ఉంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read