ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అంటే దేశ వ్యాప్తంగా మంచి పేరు ఉండేది. సాంకేతిక, డ్రోన్లు, సిసి కెమెరాలు, అధునాతన హంగులు, ఫ్రెండ్లీ పోలీసింగ్, ఇలా పోలీసులు పేరు చెప్తే గడగడలాడే పరిస్థితి. తప్పు చేస్తే, ఎవరైనా ఒకటే. అంతెందుకు, ఇప్పుడు డీజీపీగా ఉన్న గౌతం సవాంగ్ గారు, విజయవాడ కమీషనర్ గా ఉండగా, కాల్ మనీ కేసులో, అప్పటి అధికారంలో ఉన్న టిడిపి వాళ్ళని కూడా అరెస్ట్ చేసే స్వేఛ్చ అప్పటి ప్రభుత్వం ఇచ్చింది. గౌతం సవాంగ్ గారికి మంచి పేరు వచ్చింది. కేవలం ప్రభుత్వాల మార్పు, అదే పోలీస్ వ్యవస్థ, అదే సవాంగ్ గారు, పరిస్థతి మాత్రం విరుద్ధంగా మారింది. పోలీసుల తీరుని అందరూ విమర్శిస్తూ, ఎత్తి చూపే పరిస్థితి. ఏకంగా డీజీపీ కోర్టు బోనులో నుంచుని సెక్షన్లు చదవాల్సిన పరిస్థితి. ప్రతి రోజు ఏదో ఒక కేసులో ఏపి పోలీసులకు అక్షింతలు పడాల్సిందే. ఇక అధికార వైసిపి పార్టీని ఎవరైనా విమర్శించారు అంటే చాలు, ఏపి పోలీసులు మీ ఇంటి ముందు వాలిపోతారు. అది 60 ఏళ్ళు దాటిన రంగనాయకమ్మ కానీ, సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణం రాజు కానీ, ఈ ప్రభుత్వం విమర్శలు చేస్తే మాత్రం వదిలి పెట్టదు. సరే ఇదే పధ్ధతి అందరికీ ఉంటే, ఏపి పోలీసులు అందరికీ, అన్ని వర్గాలకు ఇదే రకమైన న్యాయం చేస్తే, ఎవరికీ ఇబ్బంది ఉండేది కాదు.

police 25102021 2

ఇక్కడే సమస్య. వైసిపి కార్యకర్తలు, నేతలు ఏకంగా జడ్జిలను, కోర్టులను, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ని, హైకోర్టు చీఫ్ జస్టిస్ ని, ఇలా ఎంత మందిని తిట్టినా, కోర్టు జోక్యం చేసుకుని చర్యలు తీసుకోలని చెప్పినా, చోద్యం చూస్తూ ఉంటారు. అదే టిడిపి నేతలు తిడితే, అర్ధరాత్రి ఇంటి తలుపులు బద్దలుకొట్టి, నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేస్తారు. జెడ్ ప్లస్ క్యాటగిరీ ఉన్న చంద్రబాబు ఇంటి పై దా-డి చేస్తామని ముందు రోజే చెప్పినా, పట్టించుకోరు. ఇలాంటి వైసిపి దా-డు-ల-కు కొత్త కొత్త నిర్వచనాలు చెప్తారు. భావ ప్రకటనా స్వేఛ్చ అని, వినతి పత్రం అని, బీపీ పెరిగింది అని, ఇలా ఏవో ఏవో కారణాలు చెప్పి, సమర్ధిస్తారు. ఇదే విషయం నిన్న కోర్టు ప్రస్తావించింది. హోదాలను బట్టి న్యాయం ఉండదు అని, ఎవరికైనా ఒకటే న్యాయం ఉంటుందని కోర్టు తెలిపింది. మరి టిడిపి నేతలు మాట్లితే తోడ కొట్టి, మీసం తిప్పే పోలీస్ అధికారుల సంఘం, వైసిపి నేతలు పోలీసులను అన్ని బూతులు తిడుతున్నా, ఎందుకు తొడలు కొట్టటం లేదో, మీసాలు తిప్పటం లేదో అర్ధం కావటం లేదు. మొత్తానికి ఏపి పోలీసుల వన్ సైడ్ వైఖరి పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా అన్ని వర్గాలకు న్యాయం చేస్తారని ఆశిద్దాం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read