గత రెండు నెలలుగా ఏపిలో కరెంటు బిల్లులు చూసి, షాక్ అవ్వని వారు ఎవరూ లేరు. చిన్నా, పెద్దా, పేద, గొప్ప అనే తేడా లేకుండా, అందరికీ వాయించి పడేసారు. ఆ బిల్లులు చూసి, లబో దిబో అన్న వారే కానీ, ఎవరూ సంతోషంగా లేరు. దీనికి కారణం ట్రూఅప్ చార్జీలు. ట్రూఅప్ చార్జీలు అంటే గత ఏడాదిలో విద్యుత్ సంస్థల నిర్వహణ ఖర్చులు, సర్దుబాటు చేసి, ఆ ఖర్చు వినియోగదారుడి మీద వేయటం. అయితే గతంలో విద్యుత్ కొనుగోలు యూనిట్ కు నాలుగు నుంచి ఆరు రూపాయల వరకు ఉండేది. దానికే ఏపి ప్రభుత్వం, ట్రూఅప్ చార్జీలు కింద యూనిట్ కు రూపాయి 23 పైసల వరకు మన మీద బాదింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజల్లో వ్యతిరేకత రావటంతో, ఏమి చేయాలో అర్ధం కాక ప్రభుత్వం వెనక్కు తగ్గింది. తాత్కాలికంగా ఈ ట్రూఅప్ చార్జీలును వెనక్కు తీసుకుంటున్నాం అని చెప్పారు. మళ్ళీ ఎప్పుడూ బాది పడేస్తారు. అయితే ఈ విషయం పక్కన పెడితే, ప్రస్తుతం రాష్ట్రంలో బొగ్గు కొరత భారీగా ఉంది. దాదాపుగా విద్యుత్ సంక్షోభం వచ్చేసిందని అందరూ అనుకున్నారు. సరిగ్గా ఇదే సమయంలో వర్షాలు పడటం, చలి కాలం మొదలు కావటంతో, ఒకేసారి విద్యుత్ వాడకం పడిపోవటంతో, ప్రభుత్వానికి వెసులుబాటు వచ్చింది. అయితే బొగ్గు కొరత కారణంగా, బయట నుంచి అధిక ధరకు విద్యుత్ కొంటున్నారు.

shock 25102021 2

యూనిట్ కు దాదాపుగా 15 నుంచి 20 రూపాయాల వరకు వెచ్చించి మరీ, కరెంట్ కొంటున్నారు. ఇప్పుడు ఈ భారం డిస్కాంల పై అధికంగా పడుతుంది. ఈ భారం అంతా వచ్చే ఏడాది రాష్ట్ర ప్రజల పైనే ఉంటుంది. 4-6 రూపాయలకు కొంటేనే, ఇంత భారీగా ట్రూఅప్ చార్జీల పేరుతో బాదేసారు. మరి ఇప్పుడు 15-20కి కొంటుంటే, ఎంత ట్రూఅప్ చార్జీలు బాదేస్తారో అర్ధం చేసుకోవచ్చు. ప్రతి రోజు ఇంత ఖర్చు కాకపోయినా, కొన్నప్పుడు భారం అయితే పడుతుంది. ఇక ఇక్కడ మరో విషయం, ప్రతి నేలా వినియోగదారుడు నుంచి రూపాయి, పైసలతో సహా ప్రభుత్వం కరెంటు బిల్లు వసూలు చేస్తుంది, కట్టకపోతే విద్యుత్ ఆపెస్తారు కుడా. మరి వినియోగదారుడు నుంచి వసూలు చేసిన డబ్బు అంతా ఏమి అవుతుంది ?డిస్కమ్‌ లకు సకాలంలో ఆ డబ్బు ప్రభుత్వం ఎందుకు చెల్లించటం లేదు అనే చర్చ జరుగుతుంది. దాదాపుగా రూ.11,000 కోట్ల బకాయలు ఉన్నాయి. మరి వినియోగదారుడు నుంచి వసూలు చేస్తుందని ఇచ్చేస్తే, ఈ బాకీలు ఎందుకు ఉంటాయి అని విద్యుత్ రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read