మొన్నటిదాకా చంద్రబాబు ఆరు లక్షల కోట్లు తిన్నాడు, చంద్రబాబు ఆ స్కాం చేసాడు, చంద్రబాబు అమరావతి భూములు కాజేసాడు, ఇదీ, అదీ అంటూ హడావిడి చేసిన వైసీపీ ప్రభుత్వం, ఒక్క రూపాయి అవినీతి కూడా ఇప్పటి వరకు చంద్రబాబు పై నిరూపించలేక పోయింది. అమరావతి భూములు పై కేసు నమోదు చేయగా, దాన్ని కోర్టు స్టే కూడా ఇచ్చింది. దీంతో ఎలాగైనా చంద్రబాబు పై కేసు నమోదు చేయాలి అనుకున్నారో ఏమో కానీ, మళ్ళీ చంద్రబాబు పై ఇంకో కేసు నమోదు చేసారు. అదే సోషల్ మీడియాలో టిడిపి ఏదో పోస్ట్ చేసిందని, ఎస్సీ, ఎస్టీ కేసు. ఆశ్చర్యపోతున్నా ఇది నిజం. ఒక మాజీ ముఖ్యమంత్రి, 14 ఏళ్ళు సియంగా చేసిన వ్యక్తి, 40 ఏళ్ళు ప్రజా ప్రతినిధిగా ఉన్న వ్యక్తి పై, సోషల్ మీడియాలో టిడిపి ఏదో పోస్ట్ చేసిందని, ఏకంగా ప్రభుత్వమే ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయటం ఆశ్చర్యకరం. చంద్రబాబుతో పాటుగా, మాజీ మంత్రి నారా లోకేష్ పై కూడా కేసు నమోదు అయ్యింది. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఈ కేసు నమోదు అయ్యింది. వినటానికి సిల్లీగా ఉన్నా, ఇది వాస్తవం. చంద్రబాబు పై, ఈ కేసు ఏమిటి అంటూ, తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు కూడా ఆశ్చర్య పోతున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలుగుదేశం పార్టీ అఫిషియల్ ఫేస్బుక్, ట్విట్టర్ ఎకౌంటు లో, తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి ఒక పోస్టింగ్ పడింది.

cbn 11042021 2

అందులో తిరుపతి వైసీపీ అభ్యర్ధి గురుమూర్తి, జగన్ మోహన్ రెడ్డి కాళ్ళు ఒత్తుతున్న ఫోటో ఒక వైపు, పెద్దిరెడ్డి కాళ్ళు ఒత్తుతున్న ఫోటో ఒక వైపు పెట్టి, పాద సేవ చేసే వారు కావాలా, ప్రశ్నించే వారు కావాలా అంటూ, పోస్టింగ్ వేసారు. అయితే దీని పై స్పందించిన వైసీపీ దళిత ప్రజా ప్రతినిధులు, ఈ పోస్టింగ్ పై డీజీపీకి ఫిర్యాదు చేసారు. వెంటనే ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టాలని, డీజీపీకే కంప్లైంట్ ఇచ్చారు. దీని పై విచారణ చేసిన పోలీసులు, కేసు నమోదు చేసారు. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసారు. అయితే దీని పై తెలుగుదేశం పార్టీ భగ్గుమంది. జగన్ మోహన్ రెడ్డి కాళ్ళు, గురు మూర్తి ఒత్తుతున్న ఫోటో, వారే కదా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది, అలాగే గురుమూర్తి, పెద్దిరెడ్డికి కడు ఫిజియో చేస్తారని తెలిసింది, ఇందులో తప్పు ఏముంది, మేము అదే వేసాం అని టిడిపి అంటుంది. ఏదైనా ఉంటే, ఆ ఫోటో బయటకు వదిలిన జగన్ మోహన్ రెడ్డి పై కేసు పెట్టాలని టిడిపి వాదిస్తుంది. చంద్రబాబు లక్షల కోట్లు దోచారు అని ప్రచారం చేసి, చివరకు ఇలాంటి కేసులు పెడుతున్నారని వాపోయారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read