ఈ రోజు చూస్తున్నాం... కియా మేడ్ ఇన్ ఆంధ్రా అంటూ, కొంత మంది గుజరాతీ బానిసలు, ఎలా చించేసుకుంటున్నారో... మా మోడీ పెట్టిన భిక్ష మీకు కియా అంటూ హడావిడి చేస్తున్నారు. వీళ్ళు కియాని ఎలా గుజరాత్ తీసుకోపోటానికి పన్నాగాలు పన్నారో అందరికీ తెలుసు. ఇక అతి పెద్ద ప్లాంట్ పెడదాం అనుకున్న ఫాక్స్ కాన్ ని, మహారాష్ట్ర తీసుకుపోయారు.. ఇవన్నీ మర్చిపోక ముందే, ఇప్పుడు మరో కంపెనీ ఎత్తేయటానికి మోడీ ప్లాన్ చేసారు. ఇదే విషయం లోకేష్ దావోస్ పర్యటనలో బయట పడింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో వేలకోట్ల రూపాయల పెట్టుబడులు, పరిశ్రమలు కలిగిన ఓ అపరకుబేరుడు లోకేశ్ బృందంతో భేటీ అయ్యారు. సుమారు గంటసేపు జరిగిన ఈ సమావేశంలో ఆయన చెప్పిన ఆసక్తికర విషయాలు లోకేశ్ బృందానికి మైనస్ 15 డిగ్రీల చలిలో సైతం వేడి పుట్టించాయట.

lokesh 29012019

రామాయపట్నం పోర్టుతో పాటు ఏపీలో సుమారు అయిదు వేలకోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్న ఆ పారిశ్రామికవేత్త ఇటీవల ఢిల్లీ వచ్చిన సమయంలో జరిగిన సంఘటనలను వివరించారు. సదరు పారిశ్రామికవేత్త భారత్ వస్తున్నారని తెలిసి ప్రధాని నరేంద్రమోదీ ఆహ్వానం పంపారట. దీంతో ఆయన మోదీని కలుసుకున్నారట. వ్యాపార విస్తరణ గురించి మాట్లాడుతూ ఏపీలో తమ సంస్థ అయిదు వేలకోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టబోతోందని మోదీకి వివరించారట. సమావేశం ముగిసే సమయంలో మోదీ "మీరు గుజరాత్‌లో పెట్టుబడులు పెడితే ఢిల్లీ నుంచి నేరుగా గుజరాత్ వెళ్లేందుకు సౌకర్యవంతంగా ఉంటుంది. ఢిల్లీనుంచి అహ్మదాబాద్‌కు బుల్లెట్ ట్రైన్ కూడా వేస్తున్నాం. ఎయిర్ ఫెసిలిటీ కూడా అద్భుతంగా ఉంది" అని చెప్పారట. అయితే ఆయన మాత్రం ఏపీలో పెట్టుబడులపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామనీ.. అక్కడున్న పరిస్థితులపై అధ్యయనం కూడా చేశామనీ స్పష్టంచేశారట.

lokesh 29012019

అయితే ప్రధాని మోదీ మాత్రం వత్తిడిచేయడం మానలేదట. గుజరాత్‌లో పెట్టుబడులు పెట్టాలని ఆయనను పదేపదే కోరారట. ఇదే విషయాన్ని లోకేశ్‌తో సదరు పారిశ్రామికవేత్త విపులంగా చెప్పుకొచ్చారట. తాము ఏపీనే ఎందుకు ఎంచుకున్నామో కూడా వివరించారట. పారిశ్రామిక విధానం, క్లియరెన్స్‌ల గురించి తెలుసుకునేందుకు హైదరాబాద్, ఏపీ, గుజరాత్‌లకు ఆ పారిశ్రామికవేత్త తమ బృందాన్ని పంపించారట. ఏపీలో కియాను కేస్ స్టడీగా చేసిందట ఆ బృందం. తిరుపతి, విశాఖ, విజయవాడలతో పాటు రాయలసీమలోని మరికొన్నిచోట్ల పరిశ్రమల ఏర్పాటుపై అధ్యయనం చేశారట. ఆ బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా ఏపీలో పెట్టుబడులు పెట్టాలని స్థిర నిర్ణయానికి వచ్చినట్టు ఆ పారిశ్రామిక దిగ్గజం లోకే‌శ్‌కు వివరించారట. ప్రధాని మోడీ గారికి మనం అంటే ఎందుకో మరి ఇంత కక్ష...

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read