అంతా అనుకున్నట్టే అయ్యింది. రమణ దీక్షితులను మళ్ళీ ప్రధాన అర్చకుడిగా, జగన్ మోహన్ రెడ్డి నియమించటం పై, పెద్ద దుమారేమే రేగింది. శ్రీవారి ఆలయం పై పరువు నష్టం కేసు కూడా, రమణ దీక్షితులు పై ఉండగా, ఆయన్ను ఎలా నియమిస్తారు అంటూ, ఇప్పటికే అనేక మంది ప్రశ్నించారు. పైగా రమణ దీక్షితులు రాజకీయ నాయకుల ప్రాపకం కోసం పని చేసే వ్యకి అని, అలాంటి వ్యక్తిని దూరంగా ఉంచాలని కోరారు. అనుకున్నట్టే, ఆయన నియామకం అయిన తరువాత రోజే, జగన్ మోహన్ రెడ్డిని, విష్ణుమూర్తితో పోల్చారు. ఇది కూడా పెద్ద వివాదస్పదం అయ్యింది. ఇన్ని వివాదాల నడుము, ఇప్పుడు మరో వివాదం తెర పైకి వచ్చింది. ఇప్పటి వరకు రమణ దీక్షితులు నియామకం పై ఎవరూ ఏమి అభ్యంతరం తెలపలేదని, అందరూ సంతోషంగా ఉన్నారని ప్రభుత్వం చెప్తూ వచ్చింది. అయితే ఇప్పుడు టిటిడికి సంబంధించి జీవో నెంబర్ 50 రద్దు అర్చకులు మధ్య తీవ్ర వివాదానికి తెర లేపింది. గత నెల రెండో తేదీన, టిటిడి జారీ చేసిన జీవో రద్దు చేస్తూ, టిటిడి తీసుకున్న నిర్ణయంతో, 65 ఏళ్ళకు పైబడిన అర్చకులు రిటైర్మెంట్ పరిస్థితి నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవటం, గతంలో తొలగించిన వారు, మళ్ళీ నియామకం అయ్యారు. ఇందులో ప్రధాన అర్చకుడిగా రమణ దీక్షితులు మళ్ళీ వచ్చారు.

deekshitulu 04052021 2

దీంతో అర్చకులు మధ్య ఆధిపత్య పోరు ప్రారంభం అయ్యింది. ఇప్పటికే శ్రీవారి ఆలయంలో, ప్రధాన అర్చకుడిగా, గొల్లపల్లి కుటుంబం నుంచి, వేణుగోపాల దీక్షితులు ఉన్నారు. అలాగే ఇతర కుటుంబాల వారు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు టిటిడి తీసుకున్న నిర్ణయంతో, గొల్లపల్లి కుటుంబం నుంచి, రమణ దీక్షితులు మళ్ళీ ప్రధాన అర్చకులుగా నియామకం అయ్యారు. దీంతో వేణుగోపాల దీక్షితులు , తనకు తీవ్ర అన్యాయం జరిగింది అంటూ, ఈ అంశం పై హైకోర్టుకు వెళ్లి అందరికీ షాక్ ఇచ్చారు. ఏ కుటుంబం నుంచి అయిన ఒక్కరే ప్రధాన అర్చకులుగా ఉంటారని, 2018 నుంచి, గొల్లపల్లి కుటుంబం నుంచి, తానే ప్రధాన అర్చకుడిగా ఉన్నానని, ఇప్పుడు టిటిడి ఇచ్చిన జీవోతో, మళ్ళీ రమణ దీక్షితులు రావటం పై, ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటీషన్ వేసారు. టిటిడి కూడా తనకు న్యాయం చేయలేదని, ఆయన రమణ దీక్షితులు, టిటిడి, రమణ దీక్షితులను ప్రతివాదులుగా చేర్చారు. దీంతో, ఈ పిటీషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు, అందరికీ నోటీసులు జారీ చేసింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read