ఒక ఉన్నతమైన పొజిషన్ లో ఉన్న వాళ్ళు, నలుగురికీ ఆదర్శంగా ఉండాలి. మన గురించి అందరూ గొప్పగా చెప్పుకోవాలి. అదే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వాళ్ళు అయితే ? ఒక రాష్ట్ర ప్రతినిధిగా, తనకు ఉన్న మంచి క్వాలిటీస్ తో, ఆ రాష్ట్ర ఖ్యాతిని, ప్రపంచమంతా వ్యాప్తి చెందేలా చూడాలి. అయితే ఇక్కడ ప్రభుత్వంలో ఉన్న జగన్ మోహన్ రెడ్డికి మాత్రం, ఆయన అధికారంలోకి రాక ముందే, ఆయన పై అనేక కేసులు ఉన్నాయి. సిబిఐ, ఈడీ లాంటి సంస్థలు దర్యప్తు చేసిన కేసులు, ఇప్పటికీ విచారణ జరుగుతున్నాయి. ఆయన ఈ కేసుల్లో 16 నెలలు జైల్లో ఉండి, ప్రస్తుతం కండీషనల్ బెయిల్ పై బయట ఉన్నారు. అయితే, ఇవన్నీ రాజకీయంగా కక్ష పూరితంగా పెట్టిన కేసులు అని, జగన్ మోహన్ రెడ్డి చెప్తూ వస్తున్నారు. ఏది నిజం అనేది, కోర్ట్ తీర్పు ఇచ్చిన తరువాత కాని తెలియదు.

highcourti 25082019 2

అయితే, ఈ నేపధ్యంలోనే, జగన మోహన్ రెడ్డి పై, ఆయన విచారణ సమయంలో కాని, బెయిల్ పిటీషన్లు వేసిన సమయంలో కాని, ఇలా అనేక సందర్భాల్లో జగన్ పై వివిధ కోర్ట్ లు చేసిన వ్యాఖ్యలు మాత్రం, ఇప్పటికీ జగన్ మోహన్ రెడ్డిని వెంటాడుతూనే ఉన్నాయి. ఆయన అధికారంలోకి వచినా సరే, ఆయానను ఉదాహరణగా చూపిస్తూ, వివిధ ఆర్ధిక నేరాల కేసుల్లో కోర్ట్ లు మళ్ళీ మళ్ళీ వ్యాఖ్యానిస్తున్నాయి. తాజగా కాంగ్రెస్ దిగ్గజం, మాజీ హోం మంత్రి, ఆర్ధిక మంత్రి చిదంబరం పై బెయిల్ పిటీషన్ విచారణ సమయంలో, ఢిల్లీ హైకోర్ట్ జగన్ మోహన్ రెడ్డి కేసుల ప్రస్తావన తీసుకొచ్చింది. చిదంబరం బెయిల్ రద్దు చేసే సమయంలో, తీర్పు ఇస్తూ, ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్‌ సునీల్‌ గౌర్‌, జగన్ కేసులను ఉటంకించారు. జగన్ పై వివిధ కోర్ట్ లు చేసిన వ్యాఖ్యలు ప్రస్తావీస్తూ, చిదంబరం కూడా అదే కోవలోకి వస్తారంటూ, తీర్పులోని 20, 22 పేజీల్లో జగన్ ను ప్రస్తావించింది ఢిల్లీ హైకోర్ట్.

highcourti 25082019 3

"ఆర్థిక నేరాలు, మిగిలిన నేరాలకంటే మిగిలిన వాటి కంటే పూర్తిగా భిన్నమైనవి. ఇలనాటి ఆర్ధిక నేరాలని మిగిలిన కేసులతో పోల్చలేం. అందుచేత ఆర్ధిక నేరగాళ్లకు బెయిల్‌ ఇచ్చేముందు ఆలోచించాలి. వీళ్ళు భారీ కుట్ర ద్వారా పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని కొల్లగోడతారు. అలాంటి ఆర్థిక నేరాలు దేశ ఆర్థిక వ్యవస్థకే నష్టం. వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి సంబంధించిన ఆర్ధిక నేరాల కేసులో జరిపిన దర్యాప్తును పరిశీలించిన తరువాత, సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. భారీగా ప్రజాధనం కొల్లగొట్టిన నేరపూరిత కుట్రల్లో బెయిల్‌ పిటిషన్ల పై కఠినంగా వ్యవహరించాలి. భారీ స్థాయిలో ఆర్థిక నేరాలకు పాల్పడేవారు ఎంతో నేర్పుగా ముందస్తు ప్రణాళిక వేసుకుని అమలు చేస్తారు. మోసపూరిత ఆర్థిక లావాదేవీలు దేశ ఆర్థికానికి చేటు. ఆ వ్యాఖ్యలను బట్టి చూస్తే చిదంబరం కేసులో బెయిలు కొనసాగించడం వల్ల దేశానికి తప్పుడు సంకేతాలను వెళ్తాయి’’ అని జస్టిస్‌ గౌర్‌ అభిప్రాయపడ్డారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read