వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో చలామణి అవుతున్న యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి, గుర్తింపుని రద్దు చెయ్యాలి అంటూ, అన్న వైఎస్‍ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉన్న మహబూబ్ భాషా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. వాస్తవానికి కేంద్ర ఎన్నికల కమిషన్, పార్టీలకు పేర్లు కేటాయించే సందర్భంలో కూడా, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అనే వాడుకోవాలని, వైఎస్‍ఆర్ కాంగ్రెస్ అని వాడకూడదు అంటూ షరతులు పెట్టింది. ఆ షరతు పైనే, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ రిజిస్టర్ అయ్యింది. అయితే గత కొంత కాలం తరువాత, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసి, మా పార్టీ పెద్ద పార్టీ అని, అన్న వైఎస్‍ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా పార్టీకి సంబంధం లేడని, తమకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని వాడుకునే అవకాసం ఇవ్వాలని లేఖ రాసింది. అయితే కేంద్ర ఎన్నికల కమిషన్ మాత్రం, ఆ విజ్ఞప్తిని ఒప్పుకోలేదు. అయితే కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఉన్నా సరే, జగన్ పార్టీ, తమ పార్టీ పేరును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటూ, వాడుకోలోకి తీసుకోవచ్చింది.

అయితే అధికారిక లెటర్ హెడ్ లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని వాడుతూ ఉండటంతో , ఇబ్బంది మొదలైంది. తమ పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకి ఇచ్చిన షోకాజ్ నోటీసులో, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని కాకుండా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఉండటంతో, రఘురామ రాజు అభ్యంతరం తెలిపారు. దీంతో జగన్ పార్టీ పేరు విషయం, బయటకు వచ్చింది. దీంతో, అన్న వైఎస్‍ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భాషా, అభ్యంతరం తెలుపుతూ, కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర ఫిర్యాదు చేసారు. అయితే, అక్కడ నుంచి సరైన సమాధానం రాకపోవటంతో, ఆయన ఢిల్లీ హైకోర్ట్ ని ఆశ్రయించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీలో ఉండటంతో, కేసు అక్కడ ఫైల్ చేసారు. అయితే ఈ పిటీషన్ అసలు కోర్టు పరిగణలోకి తీసుకోదు అని జగన్ పార్టీ అనుకున్న సమయంలో, ఢిల్లీ హైకోర్టు ఈ పిటీషన్ ను విచారణకు స్వీకరించి, జగన్ పార్టీకి, కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు ఇచ్చింది. దీని పై సమాధానం చెప్పాలి అంటూ, కేసును సెప్టెంబర్ 3కి వాయిదా వేసింది. స్పష్టంగా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఉండటంతో, ఇప్పుడు కోర్టు ఏమి చెప్తుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read