ప్రపంచాన్ని గడగడలాడిస్తూ, రోజురోజుకీ ఎక్కువ అవుతున్న క-రో-నా వైరస్, మన రాష్ట్రంలో విలయతాండవం చేస్తుంది. ప్రజలనే కాక, సీనియర్ అధికారులను, ప్రజాప్రతినిధులకు కూడా ఈ వైరస్ సోకుతుంది. తాజాగా ఏకంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంజద్ బాషాకు క-రో-నా సోకింది. రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా, జగన్ కడప పర్యటనకు వెళ్ళిన సమయంలో అంజద్ బాషా కనిపించలేదు. అప్పుడే కొన్ని పుకార్లు వచ్చినా, వాటిని ఎవరూ నిర్ధారించలేదు. అయితే ఇప్పుడు ఆయనకు క-రో-నా వచ్చినట్టు నిర్ధారణ అయ్యింది. ఆయన ముందుగా, కడపలోని రిమ్స్‌లో రిమ్స్ లో చికిత్స తీసుకోగా, తరువాత తిరుపతి స్విమ్స్‌ కు వచ్చారు. అయితే నిన్న సాయంత్రం, మరింత మెరుగైన వైద్యం కోసం, హైదరాబాద్ తీసుకు వెళ్ళారు. ఆయన కుటుంబ సభ్యులలో కూడా కొంత మందికి సోకినట్టు తెలుస్తుంది. స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మ మాట్లాడుతూ, అంజద్ భాషా, ఆయన కుటుంబ సభ్యలకు ఎలాంటి ఇబ్బంది లేదు అయితే, అంజద్ బాషాకు ఇది వరుకే ఉన్న ఇతర సమస్యల వల్ల, ముందు జాగ్రత్త చర్యగా ఆయనను హైదరాబాద్ తరలించినట్టు చెప్తున్నారు.

అయితే ఒక రాష్ట్ర మంత్రిగా ఉంటూ, మిగతా ప్రజలు లాగే ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకోకుండా, హైదరాబాద్ వెళ్ళటం పై విమర్శలు వస్తున్నాయి. ఒక పక్క జగన్ ప్రభుత్వం, క-రో-నా నియంత్రణలో కాని, లేకపోతే వైద్య సదుపాయాలు మెరుగుపరచటంలో కానీ, తమకు ఎదురు లేదని ప్రచారం చేసుకుంటున్నారు. అయితే మిగతా ప్రజల లాగా కాకుండా, ఆయన ఇక్కడ చికిత్స చేసుకోకుండా, కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ వెళ్ళటం చూస్తుంటే, తన సొంత ప్రభుత్వాన్నే ఇరుకున పెట్టినట్టు అయ్యింది. ఇప్పటికే క-రో-నా కట్టడిలో ప్రభుత్వం విఫలం అయ్యింది అనే విమర్శలు వస్తున్నాయి. ఒక్క పెద్ద సిటీ కూడా లేని చోట, రాష్ట్రం అంతా ఈ వ్యాధి వ్యాపించింది. ఇప్పుడు ఏకంగా డిప్యూటీ సియంకు వచ్చింది. ఆయనేమో ఇక్కడ కాకుండా, హైదరాబాద్ వెళ్లి చికిత్స చేయించుకోవటం చూస్తుంటే, ఇక్కడ సదుపాయాలు ఎలా ఉన్నాయో అర్ధం అవుతున్నాయని, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read