మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత దేవినేని ఉమాని పోలీసులు అరెస్ట్ చేసి, నందివాడ పోలీస్ స్టేషన్ లో పెట్టిన విషయం తెలిసిందే. ఇంకా ఆయన్ను జడ్జి మందు హాజారు పరచలేదు. అయితే ఈ వ్యవహారంలో అసలు ఏమి జరిగిందో చూద్దాం. ముందుగా దేవినేని ఉమ మొదటి నుంచి, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, అతని బావ మరిది అక్రమ మైనింగ్ చేస్తున్నారు అంటూ అనేక ఆరోపణలు చేసారు. గతంలో అధికారులు కూడా అక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుందని, వాహనాలు సీజ్ కూడా చేసారు. అయినా అక్కడ అక్రమ మైనింగ్ జరుగుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఒకానొక సందర్భంలో, వసంత కృష్ణ ప్రసాద్ ప్రెస్ మీట్ పెట్టి, దేవినేని ఉమా ఇలాగే మాట్లాడితే దేహశుద్ధి చేస్తాను, రాసిపెట్టుకో అంటూ తీవ్ర వ్యాఖ్యలు కూడా చేసారు. ఇంత బహిరంగంగా, ఆయన పై వ్యాఖ్యలు చేసినా, పోలీసులు పట్టించుకోలేదు. ఇది ఇలా ఉంటే ఈ క్రమంలో, మళ్ళీ అక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుందనే సమాచారం రావటంతో, దేవినేని ఉమా నిన్న మధ్యానం కొండపల్లి వచ్చి, అక్కడ స్థానిక టిడిపి నాయకులతో మాట్లాడి, అక్రమ మైనింగ్ జరుగుతున్న ప్రాంతానికి తరలి వెళ్ళారు. అక్కడకు చేరుకొని, అక్రమ మైనింగ్ జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ జరుగుతున్న అక్రమ మైనింగ్ అంతా వీడియో తీసారు.

uma 28072021 2

ఇదే సందర్భంలో అక్కడ ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ప్రెస్ మీట్ అయిన తరువాత, ఆయన తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే సరిగ్గా ఇక్కడే అసలు ట్విస్ట్ ఇప్పుడు బయటకు వచ్చింది. దేవినేని ఉమా తిరిగి వస్తూ ఉండగా, వైసీపీ నేతలున్నారని జి.కొండూరు వైపు వెళ్లాలని కొంత మంది పోలీసులు బైక్ పై వచ్చి చెప్పారని, ఆ తరువాత వెంటనే స్థానిక ఎస్సై వచ్చి గెడ్డమడుగు వైపు వెళ్లాలని చెప్పారని, అటు వెళ్ళగానే అక్కడ దాదాపుగా వంద మంది వరకు వైసీపీ కార్యకర్తలు ఉన్నారని, తమ పై రాళ్ల దా-డి చేసారని దేవినేని ఉమా చెప్తున్నారు. అయితే దేవినేని ఉమా పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటుగా, హ-త్యా-య-త్నా-ని-కి పాల్పడినట్లు 307 సెక్షన్ కింద కూడా కేసులు పెట్టారు. అయితే అసలు దేవినేని ఉమా కారు దిగలేదు, బయట పోలీసులతో తప్ప ఎవరితో మాట్లాడ లేదు, మరి ఆయన పై ఈ కేసులు ఎలా పెడతారో ఎవరికీ అర్ధం కావటం లేదని, ఇదేమి లాజిక అని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాలు అన్నీ కోర్టుకు చెప్తాం అని, అక్రమ కేసుల పై న్యాయస్థానంలోనే తేల్చుకుంటాం అని, టిడిపి నేతలు చెప్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read