దేవినేని ఉమాపై దా-డి, తరువాతజరిగిన ఆయన అరెస్ట్ వ్యవహారంలో ఐపీఎస్ స్థాయి డీఐజీ అధికారి మాటలు వింటుంటే, రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఎలా ఉందో అర్థమవుతోందని, అధికార పార్టీ వారికి పోలీస్ వ్యవస్థ ఎంతలా దాసోహమైందో స్పష్టమవుతోందని టీడీపీ సీనియర్ నేత, మాజీ శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం...! "దేవినేని ఉమామహేశ్వరరావుపై వైసీపీ గూండాలు దా-డి చేయడం, పోలీసులు ఆయనపై తప్పుడుకేసులుపెట్టి, అరెస్ట్ చేసిన వ్యవహరాంలో ఎవరో ఒక ఎస్సై స్థాయి అధికారి , దేనికో కక్కుర్తిపడి దిగజారి పోయాడంటే అర్థముంది. కానీ ఐపీఎస్ స్థాయిలో ఉన్న డీఐజీ మాట్లాడుతూ, దేవినేని ఉమామహేశ్వరరావు గారే అలర్లకు, గొడవకు కారణమని, ఆయనే అక్కడున్నవారిని రెచ్చగొట్టాడని చెప్పారు. డీఐజీ మాట్లాడేటప్పుడు ఆయన పక్కనే కృష్ణాజిల్లా ఎస్పీ కూడా ఉన్నారు. ఎస్పీ మాట్లాడుతూ, నిష్పక్షపాతంగా, నిర్భయంగా విచారణ జరుపుతామన్నారు. అసలు ఈ రాష్ట్రంలో అది సాధ్యమేనా అన్నది నా తోపాటు, ప్రతి ఒక్కరి సందేహం. మాజీమంత్రి దేవినేని ఉమాపై కేసులు పెట్టడమే అరాచకం. నిన్న సాయంత్రం 03.30ని.లకు దేవినేని ఉమా కొండపల్లి పార్టీ కార్యాలయంలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. సమావేశంలో నియోజకవర్గస్థాయి నేతలతో చర్చిస్తున్న సమయంలోనే కొండపల్లి అటవీ ప్రాంతంలో జరుగుతున్నఅక్రమ మైనింగ్ వ్యవహారాన్ని నేతలు దేవినేని ఉమా దృష్టికి తీసుకెళ్లారు. అక్రమ మైనింగ్ వల్ల కొండపల్లి బొమ్మల తయారీకి అవసరమైన కొన్ని చెట్లను దారుణంగా నరికేస్తున్నారని కూడా నేతలు చర్చించుకున్నారు. సమావేశం ముగిశాక 04.30ని.లకు కొండపల్లి అటవీ ప్రాంతంలో జరుగుతున్న మైనింగ్ ను పరిశీలించడానికి దేవినేని ఉమా, మరికొందరు బయలుదేరారు. 04.55 ని.లకు రిజర్వ్ ఫారెస్ట్ లోకి వెళ్లారు. దేవినేని ఉమాతో పాటు, పత్రికలు, ఛానళ్లకు సంబంధించిన విలేకరులు కూడా ఉన్నారు. దేవినేని ఉమా, ఇతర నేతలందరూ కలిసి దాదాపు గంటన్నర పాటు అక్రమ మైనింగ్ వ్యవహారాన్ని మీడియా ద్వారా అందరికీ తెలిసేలా చేశారు. తిరిగి సాయంత్రం 6 గంటల తర్వాత అందరూ బయలుదేరారు.

రిజర్వ్ ఫారెస్ట్ లోనుంచి దేవినేని ఉమా, టీడీపీ నేతలు బయలుదేరాక, ఇద్దరు కానిస్టేబుళ్లు వారి వద్దకొచ్చి, మీరు వచ్చిన దారిలో కాకుండా వేరే దారిలో వెళ్లాలని చెప్పి, వారిని దగ్గరుండి మరీ దారి మళ్లించింది వాస్తవమా..కాదా? దేవినేని ఉమా, ఇతర టీడీపీ నేతలు, విలేకరులతో పాటు, ఇద్దరు కానిస్టేబుళ్లు కూడా కొంత దూరం వెళ్లింది నిజమా..కాదా? ఇద్దరు కానిస్టేబుళ్లు దగ్గరుండి దేవినేని ఉమాని ఇతరులను తీసుకొచ్చి, జీ. కొండూరు వైపు వెళ్లమని చెప్పారు. కానీ జంక్షన్లో ఉన్న ఎస్సై , జీ.కొండూరు వెపు వెళితే, అక్కడ కూడా వైసీపీ కార్యకర్తలు ఉన్నారు, కాబట్టి మీరంతా గడ్డమడుగు వైపు వెళ్లమని దేవినేని ఉమాతో, ఇతరులతో చెప్పింది వాస్తవమా కాదా? ఎస్సై చెప్పినవైపు వెళ్లాకే దేవినేని ఉమా, ఇతర టీడీపీనేతల పై వైసీపీ గూండాలు దా-డి చేశారు. ఇదంతా ఒకప్లాన్ ప్రకారమే జరిగిందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? గడ్డమడుగు వెపువెళ్లమని స్థానికఎస్సై చెప్పడం, పథకంలో భాగంగా జరిగిందో లేదో ఎస్పీ, డీఐజీ చెప్పాలి. వాస్తవాలు అలా ఉంటే, ఐపీఎస్ స్థాయి అధికారులు వాటిని వక్రకరించేలా మాట్లాడటం ఏమిటి? దేవినేని ఉమాపై దా-డి జరిగిన ప్రాంతం కచ్చితంగా జీ.కొండూరు పోలీస్ స్టేషన్ కు రెండు కిలోమీటర్ల దూరంలోనేఉంది. అదనపు బలగాలను రప్పించడానికిగానీ, వైసీపీ కార్యకర్తలు జీ.కొండూరు పోలీస్ స్టేషన్ వద్ద గుమికూడటానికిగానీ ఎంతసేపు పడుతుంది? వైసీపీ కార్యకర్తలు స్టేషన్ చుట్టపక్కలకు వచ్చేవరకు పోలీస్ యంత్రాంగం ఏంచేసింది? పోలీస్ యంత్రాంగమే అధికారపార్టీ కి కొమ్ముకాసి, అధికారపార్టీకి చెందిన గూండాలు, కార్య కర్తలు టీడీపీవారిపై దా-డి చేసేలా ప్రోత్సహించింది. ఇదంతా వాస్తవమో కాదో కృష్ణాజిల్లా ఎస్పీ సమాధానం చెప్పాలి. దేవినేని ఉమాని దారిమళ్లించింది పోలీసులుకాదా? ఇవేవీ తనకు తెలియనట్లు డీఐజీ చిలుకపలుకులు పలుకుతున్నాడు. వైసీపీ కార్యకర్తలు జీ.కొండూరు పోలీస్ స్టేషన్ వద్దకు చేరడానికి పోలీసులే కారణం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read