మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ అక్రమ మైనింగ్ చేస్తున్నారు అంటూ, రెండు రోజులు క్రితం, కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ కు వెళ్లి, అక్కడ అక్రమ మైనింగ్ పరిశీలించి తిరిగి వస్తూ ఉండగా, దేవినేని ఉమ పై వైసీపీ కార్యకర్తలు రాళ్ల దా-డి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఏపిలో రివర్స్ పాలన ప్రకారం, దా-డి చేసిన వారి పై కాకుండా, బాధితుల పై కేసులు పెడుతున్నారు అంటూ టిడిపి ఆరోపించినట్టు, దేవినేని ఉమ పై 18 సెక్షన్లు ఉపయోగించి కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. తరువాత అక్కడ నుంచి తీసుకుని వెళ్లి జడ్జి ముందు హాజరు ప్రచారం, జడ్జి 14 రోజులు రిమాండ్ విధించటం తెలిసిందే. 14 రోజులు రిమాండ్ విధించటంతో, దేవినేని ఉమ ని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తీసుకుని వెళ్ళారు. ఈ రోజు బెయిల్ పిటీషన్ వేయగా, అది మంగళవారానికి వాయిదా పడింది. అయితే ఇది ఇలా ఉండగా, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సంచలన ఆరోపణలు చేస్తుంది. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఈ రోజు జరిగిన పరిణామాలు చూసి, ఏమైనా కుట్ర పన్నారా అనే కోణంలో తెలుగుదేశం పార్టీ, దేవినేని ఉమా భద్రత పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పార్టీ అధ్యక్ష్యుడు కింజరాపు అచ్చెన్నాయుడు, ఒక సంచలన పత్రికా ప్రకటన విడుదల చేసారు.

jail 300720212

దేవినేని ఉమని అక్రమంగా అరెస్ట్ చేసి, రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన తరువాత, ఈ రోజు అకస్మాత్తుగా రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాజారావును బదిలీ చేయటం పై, తెలుగుదేశం పార్టీ అనుమానం వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతం ఉన్న సూపరింటెండెంట్ రాజారావు స్థానంలో, కిషోర్ కుమార్ అనే మరో అధికారిని నియమించటం పై, టిడిపి అభ్యంతరం చెప్తుంది. ఇంత అకస్మాత్తుగా ఈ రోజుకి ఈ రోజు బదిలీ చేయటం వెనుక కుట్ర దాగి ఉందని, అచ్చేన్నాయుడు అంటున్నారు. దేవినేని ఉమకు ప్రాణ హా-ని ఉందని, అందుకే తమకు అనుకూలమైన అధికారులను అక్కడ అకస్మాత్తుగా నియమించారు అంటూ ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తమ ప్రత్యర్థులు జైలులో ఉంటే, జైలులోనే వారిని చం-పిం-చే చరిత్ర ఉందని, జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆందోళన కలుగుతుందని అన్నారు. దేవినేని ఉమకు ఎలాంటి ప్రాణహా-ని జరిగినా, ఏ విధమైన ఇబ్బంది వచ్చినా, ప్రభుత్వమే దీనికి సంపూర్ణ బాధ్యత వహించాల్సి ఉంటుందని, రాజారావు ఆకస్మిక బదిలీ వెనుక కారణం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read