గత ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోయిన దగ్గర నుంచి, జగన్ మోహన్ రెడ్డి, దేవుడు రాసిన స్క్రిప్ట్ అదిరింది అంటూ చంద్రబాబుని ఎద్దేవా చేస్తూ వచ్చారు. ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు కూడా, ఇలాగే చంద్రబాబుకి దేవుడు అదిరిపోయే స్క్రిప్ట్ రాసారు అంటూ, విమర్శలు చేస్తూ వచ్చారు. జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో కూడా, ఇదే విషయం చెప్పారు. పదే పదే చంద్రబాబుని దేవుడు రాసిన స్క్రిప్ట్ అంటూ ఎద్దేవా చేస్తున్నారు. అయితే, ఇలా ఎద్దేవా చేసే వాళ్లకి, ఈ రోజు అడిరిపోయే కౌంటర్ ఇచ్చారు. స్వంతంత్ర దినోత్సవం సందర్భంగా, నిన్న వెలగపూడిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, సెక్రటేరియట్ లకు, విద్యుత్ దీపాలతో అలంకరణ జరిగింది. లేజర్ లైటింగ్ తో, అసెంబ్లీ, సెక్రటేరియట్ మెరిసిపోతూ కనిపించాయి.

secretariat 15082019 2

ప్రతి సంవత్సరం, ఇండిపెన్డెన్స్ డే రోజు, రిపబ్లిక్ డే రోజు కూడా, ఇలా విద్యుత్ దీపాలతో అలంకరణ జరిగిదే. చంద్రబాబు ఉన్న సమయంలో, ఇలా చేసే వారు. అయితే అప్పట్లో జగన్ మోహన్ రెడ్డి, సాక్షి, వైసిపీ అమరావతిని ఎలా ఎద్దేవా చేసే వారో అందరికీ తెలిసిందే. అమరావతిని భ్రమరావతి అంటూ ఎగతాళి చేసి, తమకు అమరావతి పై ఉన్న ద్వేషం చూపించే వారు. అయితే ఇప్పుడే అదే అమరావతిలో ఉంటున్నారు అనుకోండి అది వేరే విషయం. సరిగ్గా ఇదే పాయింట్ పై చంద్రబాబు, జగన్ మోహన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. ప్రతి సారి అమరావతిని భ్రమరావతి అని, అమరావతి మొత్తం గ్రాఫిక్స్ అని, అమరావతి మొత్తం సినిమా సెట్టింగ్ అని, ఇలా అనేక రకాలుగా ఎద్దేవా చేసిన అమరావతిలోనే జగన్ చేస్తున్న పనులు ఎత్తి చూపారు.

secretariat 15082019 3

అసెంబ్లీ, సెక్రటేరియట్ భవనాలకు పెట్టిన లైటింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, చంద్రబాబు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. "దేవుడు స్క్రిప్ట్ భలే రాశాడు... ఎవరైతే అమరావతిని గ్రాఫిక్స్, భ్రమరావతి అని అబద్ధాలు చెప్పారో, వాళ్ళ చేతనే ఇప్పుడు అక్కడ లైటింగ్ పెట్టించి దాన్ని మరింత అందంగా చూపించేలా చేశాడు." అంటూ చంద్రబాబు ట్వీట్ చేసారు. నిజంగానే చంద్రబాబు చెప్పిన దాంట్లో కూడా లాజిక్ ఉంది. గతంలో అమరావతి పై ఎంతో ద్వేషం చిమ్మి, తమ పత్రికల్లో, ఛానెల్స్ లో, అమరావతి పై బురద చల్లి, ఇప్పుడు అదే అమరావతిలో, అందంగా లైటింగ్ పెట్టి, జగన్ మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతున్నాయి అంటే, నిజంగా దేవుడి స్క్రిప్టే కదా...

Advertisements

Advertisements

Latest Articles

Most Read