తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబును హౌస్ అరెస్ట్ చేయటం పై డీజీపీ గౌతం సవాంగ్‌ మీడియాతో స్పందించారు. చంద్రబాబు గారిని పోలీసులు ఎందుకు అడ్డుకున్నారో చెప్తూ ఆయన కారణాలను ఆయన వెల్లడించారు. ప్రభుత్వ విధానాల పై పోరాటం చేస్తున్నందుకు చంద్రబాబుని అడ్డుకోలేదని చెప్తూనే, పల్నాడులో 144 సెక్షన్ ఉందని, అందుకే అడ్డుకున్నామని చెప్పారు. అక్కడ ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి, అక్కడ 144 సెక్షన్ పెట్టమని, చంద్రబాబు అక్కడకు వెళ్తున్నారని తెలిసి, ముందస్తుగా చంద్రబాబును హౌస్ అరెస్ట్ చేసామని సవాంగ్‌ చెప్పారు. అయితే అక్కడ 144 సెక్షన్ పెట్టింది, మొహరం, గణేష్ నిమజ్జం కోసమని, పోలీస్ సర్కులర్ లో క్లియర్ గా ఉంది. కాని, ఇక్కడ డీజీపీ గారు మాత్రం, అక్కడ ఉద్రిక్తతలు ఉన్నాయని అంటున్నారు.

dgp 11092019 2

డీజీపీ గారు ఇలా అంటుంటే, హోం మంత్రి గారేమో, రాష్ట్రం అంతా ప్రశాంతంగా ఉంది, పల్నాడు ఇంకా ప్రశాంతంగా ఉంది, అక్కడ కేవలం తెలుగుదేశం పార్టీ పైడ్ ఆర్టిస్ట్ లు మాత్రమే హడావిడి చేస్తున్నారని తీసి పడేసారు. ఈ రోజు చంద్రబాబు ‘చలో ఆత్మకూరు’ కార్యక్రమానికి పిలుపు ఇవ్వటంతో, ఉదయం నుంచి పరిస్థితి ఉద్రిక్తంగా మారించి. ఈ కార్యక్రమానికి వెళ్లేందుకు బయల్దేరిన చంద్రబాబును పోలీసులు ఆయన ఇంటి వద్దే అడ్డుకున్నారు. గేటుకు తాళ్ళు కట్టి ఆయనను బయటకు వెళ్లనీయకుండా భారీగా పోలీసులు మోహరించారు. తనను నిర్బంధించడంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. నిర్బంధాలతో తమ పోరాటాన్ని ఆపలేరని, చలో ఆత్మకూరు కార్యక్రమాన్ని ఎప్పుడు కుదిరితే అప్పుడు వెళ్లి తీరుతామని అన్నారు. ఎన్ని రోజులు హౌస్ అరెస్ట్ చేస్తారో చేసుకోండని అన్నారు.

dgp 11092019 3

వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి దాడులు పెరిగిపోతున్నాయని, టిడిపి ఆరోపిస్తుంది. ఇదేదో ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. చంద్రబాబు అక్కడకు రెండు నెలల క్రిందటే వెళ్లి, పోలీసులకు వార్నింగ్ ఇచ్చి వచ్చారు. అలాగే టిడిపి నేతలు, డీజీపీని కలిసారు. దాడులను ఆపమన్నారు. ప్రభుత్వానికి జరుగుతున్నని అన్నీ చెప్పారు. చివరకు అటు ప్రభుత్వం, ఇటు పోలీసులు కూడా స్పందించక పోవటంతో, చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగి, తెలుగుదేశం పార్టీ తరుపున పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి, పోలీసులకు మళ్ళీ 10 రోజులు టైం ఇచ్చి, వీరిని సొంత ఊళ్ళకు తీసుకువెళ్ళమన్నారు. అప్పటికీ వారు స్పందించకపోవటంతో, చంద్రబాబు స్వయంగా వారిని తీసుకువెళ్లాలని నిర్ణయం తీసుకుని, చలో ఆత్మకూరుకు పిలుపిచ్చారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read