తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఈ రోజు రాష్ట్ర డీజీపీ గౌతం సవంగ్ కు, కొద్ది సేపటి క్రితం లేఖ రాసారు. చిత్తూరు జిల్లా కుప్పంలో, తన సొంత నియోజకవర్గంలో తెలుగుదేశం నేతల పై వైసీపీ నేతలు చేసిన దా-డు-లు గురించి, ఇందులో ప్రస్తావించారు. ఈ దాడులకు పాల్పడిన వైసీపీ నేతలను కఠినంగా శిక్షించాలని వారిని వెంటనే అరెస్ట్ చేయాలని కూడా చంద్రబాబు విజ్ఞప్తి చేసారు. కుప్పంలో, లోకేష్, శ్రావణ్ అనే ఇద్దరు టిడిపి కార్యకర్తలపై వైసీపీకి చెందిన కార్యకర్తలు దా-డు-లు చేసారని, అదే విధంగా లోకేష్ ని హాస్పిటల్ కు తీసుకుని వెళ్తూ ఉండగా కూడా అడ్డుపడ్డారని ఆ లేఖలో తెలిపారు. కేవలం అక్కడ ఉన్న అక్రమ మైనింగ్ పై ప్రశ్నించినందుకే ఇలా చేసారని, వీరి పైన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు. అదే విధంగా పట్టపగలు దా-డు-లు చేస్తున్న పోలీసులు ఇప్పటికే పట్టుకోక పోవటం పై, అభ్యంతరం వ్యక్తం చేసారు. వెంటనే డీజీపీ జోక్యం చేసుకుని, ఈ ఘటనకు సంబంధించి విషయాలు తెలుసుకుని, ఎవరు అయితే దా-డు-ల-కు పాల్పడ్డారో, వారిని అరెస్ట్ చేయాలని కోరారు. ఇటువంటివి కుప్పంలో జరగకుండా చూడాలని ఆయన డీజీపీకి విజ్ఞప్తి చేసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read