ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, 14 ఏళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన టిడిపి అధినేత చంద్రబాబు గారి ఇంటి పై, వైసీపీ మూకాలు దా-డి చేసిన సంగతి తెలిసిందే. దాదాపుగా వంద మంది వరకు వైసీపీ మూకలు వచ్చి చంద్రబాబు గారి ఇంటి పైన పడ్డారు. పెద్ద పెద్ద కర్రలు, అలాగే రాళ్ళు కూడా తీసుకుని వచ్చినా, ఎక్కడా పోలీసులు మాత్రం అడ్డుకోలేదు. ఈ పరిణామంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు షాక్ తిన్నారు. చంద్రబాబు లాంటి వ్యక్తి ఇంటి మీదకు ఇలా వెళ్లారు అంటే, అందరూ ఆశ్చర్య పోయారు. అయితే ఇదే విషయం పై డీజీపీ ఆఫీస్ కు కంప్లైంట్ ఇవ్వటానికి టిడిపి నేతలు డీజీపీ ఆఫీస్ కు చేరుకున్నారు. అయితే అనూహ్యంగా ఇక్కడ పెద్ద హైడ్రామా చోటు చేసుకుంది. డీజీపీ ఆఫీస్ కు వెళ్ళగా, అక్కడ టిడిపి నేతలను గేటు బయటే ఆపేశారు. డీజీపీ లేరని, ఎస్పీ అమ్మిరెడ్డి వచ్చి నాకే రిపరజేంటేషన్ ఇవ్వాలని కోరారు. అయితే ఇదే సమయంలో, అక్కడకు ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి రాగా, పోలీసులు ఆయన్ను లోపలకి తీసుకుని వెళ్ళటంతో అందరూ షాక్ అయ్యారు. పోలీసులే ఇలా వ్యవహరిస్తే ఇంకా ఎవరికి చెప్పుకోవాలి అంటూ టిడిపి నేతలు షాక్ అయ్యారు. కొట్టింది వాళ్ళు అయితే, పోలీసులు వాళ్ళని చక్కగా లోపలకు తీసుకుని వెళ్ళారని, తమను మాత్రం బయటే ఆపేసారని టిడిపి నేతలు అంటున్నారు.

dgp 17092021 2

రామకృష్ణా రెడ్డిని లోపలకు పంపించి దళిత ఎమ్మెల్యేలు, బీసి ఎమ్మెల్యేలను మాత్రం, ఎస్పీ అమ్మిరెడ్డి గారు బయట నిలబెట్టారని, ఇదేమి తీరు అంటూ గొడవ చేసారు. అప్పటి వరకు లోపలకు అనుమతి లేదని చెప్పిన పోలీసులు, దళితులను అవమానిస్తున్నారని చెప్పటంతో, అప్పుడు కాని ఎస్పీ అమ్మిరెడ్డి గారు తగ్గి, టిడిపి ఎమ్మెల్యేలను లోపలకు అనుమతి ఇచ్చారు. దీంతో లోపలకు వెళ్ళిన టిడిపి నేతలు, కంప్లైంట్ ఇచ్చి వచ్చారు. అయితే టిడిపి నేతలు మాత్రం పోలీసులు తీరు పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్పీ అమ్మిరెడ్డి ఇంత బహిరంగంగా ప్రవర్తిస్తున్న తీరుతో షాక్ కు గురి అయ్యామని, డీజీపీ ఆఫీస్ ముందు వైసీపీ జెండా పెట్టుకోవాలని వారిని కోరుతున్నమాని అన్నారు. పోలీసులు తీరు సరిగ్గా లేదని, డీజీపీ కార్యాలయంలో ఈ అవమానం సరైనది కాదని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలను ఇంత బహిరంగంగా ఎలా లోపలకు తీసుకుని వెళ్తారు అని, డీజీపీ ఆఫీస్ కి కూడా వైసీపీ రంగులు వేసుకోవాలని కోరారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read