టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్ర‌కి అనుమ‌తి ఇవ్వ‌కుండా ఇన్నాళ్లూ తాత్సారం చేసిన ఏపీ పోలీసులు, నాట‌కీయంగా డిజిపి పేరుతో ఒక లెట‌ర్ పంపారు. అనుమ‌తి కోసం  టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య లేఖపై స్పందించినట్టు డీజీపీ ఇచ్చిన ఆ ప్ర‌తిలేఖ‌లో చాలా వివ‌రాలు కోర‌డంతో టిడిపి వ‌ర్గాలు విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నాయి. ప్రతి జిల్లాలో పాదయాత్ర జరిగే తేదీ, స్థలం, సమయం వివరాలు త‌మ‌కు ముందుగానే ఇవ్వాల‌ని కోరారు. జిల్లాలో రూట్ మ్యాప్ లు, ఎందరు పాల్గొంటారనే వివరాలు కూడా స‌మ‌ర్పించాల‌ని డీజీపీ విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న లేఖ‌లో కోరారు. పాదయాత్రలో వినియోగించే వాహనాలు, వాటి నంబర్లు, రాత్రి బసచేసే ప్రాంతం , జిల్లాలో సంప్రదించాల్సిన వ్యక్తుల ఫోన్ నంబర్లుతో కూడిన వివ‌రాలు తెల్లారేసరికి ఇవ్వాల‌ని డిజిపి పంపిన లేఖ‌పై టిడిపి భ‌గ్గుమంది. చాలా మంది పాద‌యాత్ర‌లు చేసిన‌ప్పుడు లేని ఈ నిబంధ‌న‌లు ఇప్పుడెలా వ‌చ్చాయ‌ని ప్ర‌శ్నిస్తున్నారు. లోకేష్ పాద‌యాత్ర జ‌ర‌గ‌కుండా అడ్డుకునేందుకు పోలీసుశాఖ విశ్వ‌ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని, ఎట్టి ప‌రిస్థితులు ఎదురైనా పాద‌యాత్ర చేసి తీరుతామంటున్నారు. దీనిపై చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు ``ఆయ‌న డిజిపి కాదు..క‌సి..రెడ్డే`` అంటూ ట్వీట్ చేశారు. టిడిపి అఫీషియ‌ల్ హ్యాండిల్ నుంచి కూడా డిజిపి అడిగిన వివ‌రాలే డిజిపిని కూడా అడుగుతూ ట్వీటేశారు. మొత్తానికి యువ‌గ‌ళం పాద‌యాత్ర‌కి అనుమ‌తి ఇవ్వ‌కూడ‌ద‌నే ఇటువంటి అడ్డ‌గోలు స‌మాచారం అడుగుతున్నార‌నేది స్ప‌ష్టం అవుతోంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read