వైసిపీ ప్రభుత్వ కక్ష సాధింపు రాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయి. టిడిపి సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర పై, ప్రభుత్వం మరో అస్త్రాన్ని ప్రయోగించింది. గతంలో సంగం డయిరీన స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేసి జీవో జారీ చేసినప్పటికీ కూడా, అప్పట్లో హైకోర్టు సింగల్ బెంచ్ తో పాటుగా, డివిజనల్ బెంచ్ కూడా ఆ ఉత్తర్వులను కొట్టివేసింది. దీంతో ప్రభుత్వం అప్పట్లో వెనక్కు తగ్గింది. అయితే ప్రస్తుతం పాల రైతులకు, వారి కుటుంబ సభ్యులకు, కూడా 50 శాతానికి వైద్యం అందిస్తూ, మరి కొంత మందికి ఉచిత వైద్యం అందిస్తూన్న ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్ కు చెందిన, ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ హాస్పిటల్ ని, ట్రస్ట్ ని రెండిటిని స్వాధీనం చేసుకునేందుకు, సహకార చట్టంలోని 6ఏ కింద నోటీసులను ప్రభుత్వం జారీ చేసింది. దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్‍లాల్, ఇది చారిటబుల్ ట్రస్ట్ కింద ఉందని, అయితే ఇందులో నిబంధనలను పాటించటం లేదని, దీన్ని ఎందుకు స్వాధీనం చేసుకోకూడదో వివరణ ఇవ్వాలని చెప్పి, దీనికి మ్యానేజింగ్ ట్రస్టీ గా ఉన్న, ధూళిపాళ్ల నరేంద్ర కు ఈ విషయంలో నోటీసులు జారీ చేసారు. వారం రోజుల్లో సంతృప్తికరమైన వివరణ ఇవ్వకపోతే ట్రస్ట్ ను స్వాధీనం చేసుకుంటాం అని, నోటీసులో తెలిపారు.

dhuilipalla 2702021 2

ఇందుకు తమకు అధికారులు ఉన్నాయని, చట్టం తమకు ఈ అధికారులు ఇచ్చిందని నోటీసులో పేర్కొన్నారు. అయితే ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్ కు సంబధించి, సంగం డయిరీకి పాలు పోస్తున్న రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు అని కూడా ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నిధులు ఆధారంగా ట్రస్ట్ నడుస్తుందని పేర్కొన్నారు. అయితే చారిటబుల్ ట్రస్ట్ కు సంబంధించి ఈ నిబంధనలు వర్తించవు అని చెప్తూ, ఎందుకు స్వాధీనం చేసుకోకూడదో చెప్పాలని కోరారు. అయితే ఇటువంటి నోటీసులకు గతంలో కూడా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమీషనర్ గా ఉన్న దుర్గ గుడి ఈవో భ్రమరాంభ గతంలో నోటీసులు జారీ చేసారు. అయితే దీని పై సంగం డయిరీ నుంచి సమాధానం కూడా పంపారు. అయితే తాజాగా మళ్ళీ ఈ నోటీసులు ఇవ్వటం మధ్య కలకలం రేగింది. అయితే ఇటువంటి నోటీసులను, చట్టప్రకారంగా, న్యాయ ప్రకారంగా ఈ కుట్రలను ఎదుర్కుంటాం అని, టిడిపి నేతలు దీటుగా సమాధానం చెప్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read