జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, కేంద్రానికి మంచి సంబంధాలు ఉన్నాయని ప్రచారం చేసుకుంటూ ఉంటారు. అది ఒక విధంగా వాస్తవం అని కొన్ని సంఘటనలు చూస్తే అర్ధం అవుతుంది కూడా. కేంద్రం నుంచి వచ్చే నిధులు కానీ, ఎక్కువగా అప్పులు తీసుకునే వెసులుబాటు విషయంలో కానీ, ఇలా అనేక విషయాల్లో కేంద్రం సపోర్ట్ జగన్ కు ఉంటూ వస్తుందని ఆ పార్టీ చెప్పుకుంటూ వస్తుంది. అయితే కీలకమైన విషయాల్లో మాత్రం కేంద్రం ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేస్తుంది. ఉదాహరణకు చంద్రబాబు పై సిబిఐ ఎంక్వయిరీ వేయాలని ఎంత మొత్తుకున్నా, సరైన ఆధారాలు ఏమి లేకపోవటంతో కేంద్రం ఒప్పుకోలేదు. అలాగే రాజధాని మార్పు విషయంలో కానీ, శాసనమండలి రద్దు విషయంలో కానీ, అన్నిటికంటే ముఖ్యమైన విభజన హామీలు, పోలవరం, స్పెషల్ స్టేటస్, ఇలా అనేక కీలకమైన విషయాల్లో మాత్రం కేంద్ర సహకారం లేదనే చెప్పాలి. ఇప్పుడు మరోసారి మరో కీలకమైన విషయం పై, కేంద్రం నో చెప్పింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దిశా చట్టం బిల్లుని కేంద్రం వెనక్కు పంపించింది. గతంలో కూడా ఒకసారి కేంద్రం ఇలాగే బిల్లుని తిప్పి పంపించింది. సవరణలు చేసి మళ్ళీ పంపించగా, ఇప్పుడు రెండో సారి కూడా కేంద్రం ఆ బిల్లుని వెనక్కు పంపించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లు పై అనేక ప్రచారాలు చేసింది. రాజకీయంగా కూడా ఈ బిల్లును వాడుకుంది. అయితే ఇప్పుడు ఈ బిల్లు ఇంకా పాస్ కూడా కాలేదు, ఇంకా చట్టం కూడా అవ్వలేదు.

దిశా చట్టం కింద కేసులు పెడుతున్నామని పోలీసులు చెప్తున్నారు, ఉ-రి శిక్ష కూడా పడిందని అంటున్నారు, తీరా చుస్తే ఈ బిల్లు అసలు ఆమోదమే పొందలేదని, ఇలాంటి బిల్లుతో ఆ చట్టాలు కింద ఎలా కేసులు పెడుతున్నారని, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అయితే ఈ రోజు వచ్చిన వార్త, ఈ వాదనకు బలం చేకుర్చుంది. దిశా బిల్లులోని లోపాలను ఎత్తి చూపుతూ, కేంద్రం అభ్యంతరం తెలిపింది. వాటిని సరి చేసి, మళ్ళీ తమకు బిల్లు పంపించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారే చేసింది. దీంతో ఇప్పుడు ఈ బిల్లు సవరణలు చేసి, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పెట్టి కానీ కేంద్రానికి పంపించటానికి కుదరదు. ఈ బిల్లులో ఏపి విభాగానికి వర్తించేలా మాత్రమే, ఐపిసిలో కొత్త సెక్షన్లను ఏపి జోడించింది, బిల్లుగా మార్చింది. ఇందులో 21 రోజుల్లో శిక్షతో పాటుగా, ఉ-రి శిక్ష లాంటివి కూడా ఉన్నాయి. అయితే ఇప్పటికీ ఈ బిల్లు రాష్ట్ర అసెంబ్లీలో, మండలిలో మాత్రమే ఆమోదం పొందింది. ఈ బిల్లుని కేంద్రం మాత్రం ఆమోదించలేదు. బిల్లులో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని, వాటిని వెనక్కు తిరిగి పంపించింది. మరి రాష్ట్ర ప్రభుత్వం, ఈ అంశం పై ఎలా స్పందిస్తుందో చూడాలి. పెద్ద ఎత్తున ప్రచారం చేసిన ఈ చట్టం, ఇంకా కేంద్రం ఆమోదించక పోవటం, రాజకీయంగా కూడా విమర్శలు ఎందుర్కునే సందర్భం అనే చెప్పాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read