ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై, రాష్ట్ర హైకోర్టు సీరియస్ అయ్యింది. నేరస్థులను రక్షించే ఉద్దేశం మీకు ఉందా అంటూ, హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. తమకు మీతో ఎలా వ్యవహరించాలో తెలుసు అంటూ, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండేళ్ళ క్రితం సంచలనం సృష్టించిన విశాఖపట్నం డాక్టర్ సుధాకర్ కేసు విషయంలో, రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వం పైన సీరియస్ అయ్యింది. డాక్టర్ సుధాకర్ నర్సీపట్నం ప్రభుత్వ హాస్పిటల్ లో మత్తు డాక్టర్ గా పని చేసేవారు. క-రో-నా సమయంలో మాస్కు ఇవ్వటం లేదని,మీడియాతో చెప్పినందుకు, ఆయన్ను సస్పెండ్ చేసారు. తరువాత ఇది పెదా విషయం అవ్వటంతో, ఆయన్ను వేధించటం మొదలు పెట్టారు. తరువాత కొన్ని రోజులకు ఆయనను విశాఖ వీధుల్లో కొడుతూ ఉన్న వీడియోలు బయటకు వచ్చాయి. ఈ కేసు విషయంలో వీడియో క్లిపింగ్స్ జత చేస్తూ, టిడిపి మహిళా విభాగం అధ్యక్షురాలు అనిత హైకోర్ట్ కు ఉత్తరం రాయటంతో, ఆధారాలు పరిశీలించిన కోర్టు, సుమోటో గా కేసు నమోదు చేసి, సిబిఐ దర్యాప్తునకు ఆదేశించింది. ఈ కేసు విచారణ జరుగుతూ ఉండగానే, డాక్టర్ సుధాకర్ మరణించిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటే, డాక్టర్ సుధాకర్ కేసు కేసు, నిన్న హైకోర్టు ముందుకు మళ్ళీ విచారణకు వచ్చింది. సిబిఐ న్యాయవాదులు కోర్టు ముందుకు హాజరు అయ్యారు.

sudhakar 25112021 2

వాళ్ళు దర్యాప్తు నివేదికను సీల్డ్ కవర్ లో కోర్టుకు సమర్పించారు. ఇప్పటికే చార్జ్ షీట్ దాఖలు చేసినట్టు కోర్టుకే తెలిపారు. అయితే ఎ సందర్భంగా సిబిఐ కోరిన పోలీస్ ఆఫీసర్లను ప్రాసిక్యూట్ చేయటానికి ప్రభుత్వం అనుమతి ఇస్తే, మరింత ముందుకు వెళ్తాం అని కోర్టుకు చెప్పారు. దీంతో కోర్ట్ సీరియస్ అయ్యింది. సిబిఐ కోరిన విధంగా ఎందుకు పోలీసు అధికారులను ప్రాసిక్యూట్ చేసేందుకు పర్మిషన్ ఇవ్వలేదని ప్రశ్నించింది. నేరస్థులను రక్షించేందుకు మీరు ప్రయత్నాలు చేస్తున్నారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇలాగే కొనసాగితే, తమకు ఎలా వ్యవహరించాలో కూడా తెలుసు అంటూ హైకోర్టు సీరియస్ అయ్యింది. అయితే పోలీస్ అధికారుల తరుపున న్యాయవాది స్పందిస్తూ, సిబిఐ కోరుతున్న పోలీస్ వారిని విచారణ చేయటానికి ప్రభుత్వ అనుమతి అవసరం లేదని చెప్పారు. దీనికి స్పందించిన కోర్టు, ఆ విషయం మెమో రూపంలో దాఖలు చేయాలని, ఈ కేసు విచారణను వారం రోజులుకు వాయిదా వేస్తున్నట్టు తెలిపింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read