విశాఖపట్నం, నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ కేసులో, మరో సంచలానికి తెర లేపేలా, డాక్టర్ సుధాకర్ తల్లి, సంచలన ఆరోపణలు చేసారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ, తమకు కొంత మంది ఫోనులు చేసి రాజీకి రమ్మని కోరుతున్నారని, తన కొడుకు తప్పు చేసినట్టుగా ఒప్పుకోమన్నారని ఆరోపించారు. తన కుమారుడు ఏ తప్పూ చేయలేదని స్పష్టం చేసిన డా.సుధాకర్ తల్లి, రాష్ట్ర ప్రభుత్వం తమ కుటుంబానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసారు. పరువుగల తమ కుటుంబాన్ని బజారుకీడ్చారని ఆవేదన వ్యక్తం చేసారు. న్యాయస్థానాల్లో తమకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు డా.సుధాకర్ మాతృమూర్తి. ఘటన జరిగిన రోజు నుంచి, ఎంతో మంది తమకు అండగా నిలిచారని, అప్పటి నుంచి ప్రభుత్వం తరుపు నుంచి ఎవరూ రాలేదు కాని, ఈ రోజు నుంచి తనకు ఫోనులు వస్తున్నాయని, మీ అబ్బాయికి జాబ్ ఇచ్చేస్తాం, ఇంకా ఈ విషయం పై ఏమి మాట్లాడ వద్దు అంటూ, ఫోన్లు చేస్తున్నారని, ఎలా ఒప్పుకుంటాం అంటూ, ఆమె మీడియాకు తెలిపారు.

మా బాబుకి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఎవరూ రాలేదు కాని, ఈ రోజు కోర్ట్ కు వెళ్ళటం, కేసు కోర్టులో ఉండటంతో, ఇప్పుడు మేము వీళ్ళకు కనిపించాం అని అన్నారు. ఇప్పుడు వచ్చి జాబ్ ఇచ్చేస్తాం అని అంటున్నారని, జాబు తీసుకుంటాం కాని, ముందు మీరు చేసిన తప్పు ఒప్పుకోవాలని అన్నారు. ఏమి మాట్లాడవద్దు అని అంటున్నారని, వీళ్ళను నమ్మి, నా కొడుకుని ఇంత చేసిన వాళ్ళని ఎలా నమ్మి, నోరు మూసుకుని కూర్చోమంటారు అంటూ ప్రశ్నించారు. రేపు కోర్ట్ తీర్పు ఉందని, వాళ్ళు ఏమి చెప్తే అది చేస్తాం అని అన్నారు. మా కుమారుడికి జాబ్ ఇచ్చేస్తాం అంటున్నారు, ఇది అందరి సమక్షంలో జరగాలి, చేసినవి అన్నీ ఒప్పుకోవాలి, మా బాబు అడిగిన న్యాయమైన డిమాండ్ తీర్చాలి, ఏదైనా అందరి ముందుకు జరగాలి అని అన్నారు.

మమ్మల్ని తప్పు ఒప్పుకోమని అంటున్నారని, హాస్పిటల్ లో ఏమి జరుగుతుందో తెలియటం లేదని, మా బాబుని కూడా బలవంత పెడుతున్నారేమో అనిపిస్తుంది అని, ఆ హాస్పిటల్ లో వేసారు అంటేనే, ఇబ్బంది పెట్టటానికి కదా అని సుధాకర్ తల్లి వాపోయారు. వాళ్ళే అక్కడకు వెళ్తున్నారు, మా బాబు పై బలవంతం చేస్తున్నారు, మా బాబు పై కూడా ఒత్తిడి తెస్తున్నారు, మా తప్పు లేకుండా, ఇంత చేసారు అని అన్నారు. పెద్దలు దగ్గర నుంచి కాల్స్ వస్తున్నాయి కాని, ఎవరు అనేది మీడియా ముందు చెప్పలేం కదా, మీడియా ముందుకు వెళ్ళవద్దు అని చెప్తున్నారు. ఇన్నాళ్ళు లేని మీరు, ఇప్పుడు వచ్చి, ఫోనులు చేస్తున్నారని, కోర్టులో తీర్పు వస్తుందని స్పందించే మిమ్మల్ని, నేను ఎలా నమ్ముతాను అని ప్రశ్నించారు. నా కొడుక్కి ఎంత చేసారో, అంత సారీ వీళ్ళు చెప్పాలి, అప్పటి వరకు, దేనికీ ఒప్పుకోం అంటూ తేల్చి చెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read