విశాఖపట్నంలో, డాక్టర్ సుధాకర్ వ్యవహారం పై, హైకోర్ట్, ఈ కేసుని సిబిఐకి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే అంతకు ముందు, హైకోర్ట్ ఆదేశాలు మేరకు, విశాఖ 5వ అదనపు మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌, డాక్టర్ సుధాకర్ వాంగ్మూలం తీసుకున్నారు. ఈ వాంగ్మూలంలో, డాక్టర్ సుధాకర్ సంచలన విషయాలు బయట పెట్టారు. "తాను నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో పని చేస్తున్నానని, కోరనా వచ్చిన తరువాత, పలుమార్లు, మాస్కులు అడిగానని, అయితే స్టాక్ లేదనే సమాధానం వచ్చిందని అన్నారు. తమ హాస్పిటల్ ను, ఇసోలేషన్ కేంద్రంగా మార్చారని, తనకు ఎప్పటి నుంచో, బీపీ, షుగర్ ఉండటంతో, సెలవు తీసుకుందాం అనుకున్నా, ఎస్మా వల్ల సెలవు ఇవ్వలేదని అన్నారు. అయితే, పలు సందర్బాలలో, మాస్కులు అడిగినా, మత్తు డాక్టర్ కి మాస్కు అవసరం ఏమి ఉంది అని చెప్పారని అన్నారు. ఈ సందర్భంలోనే ఒక ఎమర్జెన్సీ పేషంట్ రావటం, ఆవిడకు దగ్గు, జలుబు ఉండటంతో, ఎన్‌-95 మాస్కు ఇవ్వాలని కోరాగా, అది ఇచ్చి, దీన్నే 15 రోజులు వాడాలని చెప్పారని అన్నారు.

ఆ ఆపరేషన్ అయిన తరువాత, అక్కడ స్టాఫ్ మాస్కులు లేక ఎదుర్కుంటున్న సమస్యను వీడియో తీసి, స్థానిక ఎమ్మెల్యే దగ్గరకు వస్తే, ఆగ్రహం వ్యక్తం చేసి బయటకు గెంటేసారని, ఆ సమయంలో, అక్కడ ఉన్న ఎమ్మెల్యే, మిగతా వారికి ఎన్‌-95 మాస్కులు ఉన్నాయి కాని, డాక్టర్లకు మాత్రం లేవని అన్నారు. తనని బయటకు గెంటేయటంతో, బయట మీడియా వారు ఏమి జరిగింది అని అడగటంతో, వారికి జరిగిన విషయం చెప్పానని, తరువాత తనకు సస్పెన్షన్ ఆర్డర్ ఇచ్చారని అన్నారు. తరువాత కొంత మంది వచ్చి, మా అబ్బాయి బైక్ సీజ్ చేసారు, ఎందుకు చేసారని పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లి అడిగాను, ఆ సమయంలో, మహిళా కానిస్టేబుల్ నా చేయి పట్టుకుని, వదలండి అంటూ అరిచింది, పోలీసులు వచ్చి నన్ను కొట్టారు. ఉద్యోగంలో నుంచి డిస్మిస్ చేస్తాం అని బెదిరించి, నా కొడుకు పై కరోనా సమయంలో బండి నడిపినట్టు కేసు పెట్టారు, నా దగ్గర ఉన్న, మొబైల్, డబ్బులు లాక్కుని పంపించేసారు అని చెప్పారు.

అయితే మే 16న, హౌసింగ్ ఫైనాన్సు వారికి చెక్కు ఇవ్వటం కోసం, ఆంధ్రాబ్యాంక్ లో 10 లక్షలు డిపాజిట్ చెయ్యటానికి వెళ్తుంటే, నా వెనుక ఎవరో ఫాలో అయ్యారు. భయం అనిపించి, ఇంటికి వెళ్ళిపోదాం అనుకుని, వెనక్కు వచ్చేసాను, అయిత దారి మధ్యలో నన్ను ఇద్దరు ట్రాఫిక్ పోలీసులు వచ్చి ఆపి, రెచ్చగొట్టటం మొదలు పెట్టారు. కారులో ఉన్న నగదు, ఫోన్, పర్స్ తీసేసుకున్నారు. మద్యం బాటిళ్ళు కారులో పెట్టటం కనిపించింది. నన్ను రెచ్చగొడుతూ, కొంత సేపటికి, కొట్టి, చొక్కా చించి, తన్ని, ఇష్టానుసారం చేసారు. తాగాను అని, అరుస్తూ, హడావిడి చెయ్యటంతో, ఏదో కుట్ర పన్నుతున్నారని అర్ధం అయ్యింది. అక్కడ నుంచి ఆటోలో, స్టేషన్ కు తీసుకు వచ్చి, రెండు గంటలు నెల పైనే పడేసారు. నన్ను కలవటానికి వచ్చిన వారిని కూడా లోపలకు వదలలేదు. అక్కడ నుంచి కేజీహెచ్ కు, అక్కడ నుంచి మెంటల్ హాస్పిటల్ కు మార్చారు అని ఆయన వాంగ్మూలంలో చెప్పారు. అలాగే, ఆరు చోట్ల గాయాలు అయిన ఫోటోలు కూడా, కోర్ట్ కు సమర్పించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read