మన రాష్ట్రంలో మీడియా పై, రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా ఉన్న విషయం తెలిసిందే. జీవో నెంబర్ 2430 తీసుకు వచ్చి మరీ, మీడియాను టార్గెట్ చేసారు. కావాలని, ఎవరైనా ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించే కధనాలు రాస్తే, వారి పై కేసులు పెడతాం అంటూ ప్రభుత్వం హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీని పై దేశ వ్యాప్తంగా, మీడియా, జర్నలిస్ట్ వర్గాల నుంచి వ్యతిరేకత కూడా వచ్చింది. ఈ రోజు పార్లమెంట్ లో కూడా, టిడిపి ఎంపీ, గల్లా జయదేవ్ ఈ విషయం లేవనెత్తారు. అయితే ఇప్పటి వరకు, ఈ జీవో ఉపయోగించి, ఎలాంటి కేసు అయితే నమోదు కాలేదు. అయితే ఈ రోజు మంత్రి ఆదిమూలపు సురేష్ చేసిన వ్యాఖ్యలు వింటే, మొదటి కేసు ఆంధ్రజ్యోతి పై పెట్టే అవకాసం ఉన్నట్టు తెలుస్తుంది. మొన్న శనివారం, వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో, ఆంధ్రజ్యోతి ఎండీ రాధకృష్ణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఇంగ్లీష్ మీడియం అమలకు, ప్రభుత్వం చూపుతున్న ఉత్సాహం పై, తన అభిప్రాయాన్ని, ఆ కార్యక్రమంలో వ్యక్త పరిచారు.

medigag 1811209 2

ఒకేసారి తెలుగు మీడియం తీసేసి, బలవంతంగా ఇంగ్లీష్ మీడియం రుద్దితే, అటు పిల్లలతో పాటు, టీచర్లు కూడా చెప్పలేరని, నెమ్మదిగా ఈ ప్రక్రియ చేపట్టాలని, అలాగే తెలుగు మీడియంని ఆప్షనల్ గా పెట్టాలని, ఎవరికి కావల్సింది వారు, సెలెక్ట్ చేసుకుంటారని చెప్పారు. ఇంత పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నా ప్రభుత్వం ఎదురు దాడి చేసి, మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు అని ఎదురు ప్రశ్నించి తప్పుదోవ పట్టిస్తుందని అన్నారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక, ఏదో ఉంది అని చెప్తూ, ఇంగ్లీష్ మీడియం బలవంతంగా రుద్దటం పై, మత మార్పిడులు చేసే అవకాసం ఉందని, ఆ కుట్ర ఉందా అనే అనుమానం వ్యక్తం అవుతుంది అంటూ, వీకెండ్ కామెంట్ లో తన అభిప్రాయం చెప్పారు, రాధాకృష్ణ.

medigag 1811209 3

అయితే ప్రభుత్వం ఈ విషయం పై సీరియస్ గా తీసుకుంది అని, రహస్య ఎజెండాతో జగన్ ప్రభుత్వం పై విషం చిమ్ముతున్నారని, వక్రీకరణ వార్తలు రాశారని, అందుకే కొత్త పలుకు పేరుతో ఆంధ్రజ్యోతిలో వచ్చిన విశ్లేషణపై చట్టపరమైన చర్య తీసుకుంటామని మంత్రి సురేష్ తెలిపారు. ఈ మాటలను బట్టి చూస్తుంటే, జీవో 2430 ద్వారా, మొదటి కేసు ఆంధ్రజ్యోతి పై పెట్టే అవకాసం ఉంది. అయితే, ఈ విషయం పై ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఛానెల్ లో స్పందించింది. వార్తకు, అభిప్రాయానికి తేడా ఉందని, వీకెండ్ కామెంట్ అనేది ఆర్కే చెప్పే అభిప్రాయం అని మంత్రి తెలుసుకోవాలని అంటున్నారు. అయితే, ఇదే వ్యాఖ్యలు పదే పదే చేస్తున్న, బీజేపీ ఏపి అధ్యక్షుడు, కన్నా లక్ష్మీ నారాయణను మాత్రం, ప్రభుత్వం ఒక్క మాట కూడా అనకపోవటం, గమనార్హం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read