సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అవుతూ ఉండటంతో, తమ పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చెయ్యటానికి, సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం పై, తాడేపల్లిలోని తన నివాసంలో శుక్రవారం వైసీపీ ఎంపీలతో జగన్‌ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో, ఎంపీలకు జగన్ చెప్పిన విషయం పై, పలు వార్తా పత్రికల్లో కద్నాలు వచ్చాయి. ఎవరూ పార్టీ లైన్ దాటటానికి వీలు లేదని, అందరూ పార్టీకి లోబడే ఉండాలని, కొన్ని టీవీ చర్చల్లో, సొంత అభిప్రాయం చెప్తూ ఉన్న విషయం తన ద్రుష్టికి వచ్చిందని జగన్ అన్నారు. అలాగే ఢిల్లీలో, ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు, ప్రధాని మోడీని, కేంద్ర మంత్రులను కలుస్తున్నారని తెలిసిందని, ఏ సమస్య పైన కలిసినా, విజయసాయి రెడ్డి అభిప్రాయం తీసుకుని, ఆయనతో కలిసే వెళ్లి వారిని కలవాలి అని చెప్పినట్టు, ఆ కధనాల్లో వచ్చింది. విజయసాయి రెడ్డితో లేక ఎంపీ మిథున్‌ రెడ్డిని కలిసి, వారి అభిప్రాయాలూ, వారి సూచనలు తీసుకున్న తరువాతే, వెళ్ళాలని చెప్పినట్టు ఆ కధనాల్లో వచ్చాయి.

meet 17112019 2

ఇలా కాకుండా, మీ ఇష్టం వచ్చినట్టు వెళ్తే, ఇక నుంచి షోకాజ్‌ నోటీసు జారీ చేసేందుకూ వెనుకాడను అంటూ ఎంపీలను జగన్‌ హెచ్చరించారని, వార్తలు వచ్చాయి. అయితే, జగన్ ఈ వ్యాఖ్యలు ఎందుకు చేసారు, ఎవరిని ఉద్దేశించి చేసారు అనే చర్చ మొదలైంది. సహజంగా, జగన్ ను దాటి, వెళ్ళే సాహసం ఎవరూ చెయ్యరని, వైసిపీలో చెప్తూ ఉంటారు, మరి అలా కాకుండా, డైరెక్ట్ గా బీజేపీతో సన్నిహితంగా ఉంటున్న ఎంపీలు ఎవరూ అనే చర్చ మొదలైంది. ఇటీవలే ఓ లోక్‌సభ కమిటీ చైర్మన్‌ పదవి పొందిన ఒక ఎంపీ గురించి అంటూ వార్తలు వస్తున్నా, ఆ విషయం పై, వైసీపీ వర్గాలు మాత్రం నోరు ఎత్తటం లేదు. అయితే, ఇప్పుడు జగన్ హెచ్చరికలు గట్టిగా చెయ్యటంతో, ఆ ఎంపీలు అందరూ ఇప్పుడు జగన్ చెప్పినట్టు వినాల్సిన పరిస్థితి.

meet 17112019 3

అయితే మరో పక్క తెలుగుదేశం పార్టీ నేతలు, ఏడుగురు ఎంపీలు బీజేపీతో టచ్ లో ఉన్నారని, సగానికి పైగా ఎంపీలను తీసుకుని, పార్లమెంటరీ పార్టీని విలీనం చేసుకునే వ్యూహంలో బీజేపీ ఉందని, అందుకే ఆ వార్తలు చర్చలోకి లేకుండా ఉండేదుకే, ఇలా ప్రెస్ మీట్ లుపెట్టి, బూతులు తిట్టిస్తూ, అటెన్షన్ మొత్తం, అటు తిప్పుతున్నారని, టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, ఈ ప్రచారంలో వాస్తవం ఉందొ లేదో తెలియదు కాని, ఇప్పుడు జగన్ హెచ్చరిక వార్తలు, పత్రికల్లో రావటంతో, ఏదో జరుగుతుంది అనే చర్చ మాత్రం జరుగుతుంది. ఇప్పటికిప్పుడు జగన్ మోహన్ రెడ్డి పై, ఎవరూ ధిక్కారం చూపించకపోయినా, సమీప భవిష్యత్తులో బీజేపీ మాత్రం, ఏదో ఒక వ్యూహం పన్నుతుంది అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read