టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్  ప్రారంభించనున్న యువ‌గ‌ళం పాదయాత్రకు నాన్చి..నాన్చి అయిష్టంగా అనుమ‌తులు ఇచ్చిన పోలీసులు  మొత్తంగా 14 షరతులు పెట్టారు. ఇవ‌న్నీ కూడా పాద‌యాత్ర‌ని అడ్డుకునే ఆంక్ష‌లేన‌ని టిడిపి వ‌ర్గాలు మండిప‌డుతున్నాయి. ఖాకీలు పెట్టిన ఈ ష‌ర‌తులు అన్నీ పాటించడం అసాధ్యం. అంటే పాద‌యాత్ర జ‌ర‌గ‌కూడ‌ద‌నే ఆలోచ‌న‌తోనే ఇటువంటి ఆంక్షలు పెట్టార‌ని డిజిపి స్టేట్మెంట్తోనూ తేట‌తెల్లం అయ్యింది. డిజిపి పేరుతో విడుద‌లైన ప్ర‌క‌ట‌న మేర‌కు మొత్తం పాద‌యాత్ర‌లో పాల్గొనే జ‌నాలు సంఖ్య‌, వారి వివ‌రాలు, వాహ‌నాలు ఒక‌టేమిటి స‌ర్వం అడిగారు. అప్పుడే యువ‌గ‌ళం ముందుకు సాగ‌కుండా ఉండే ఎత్తుగ‌డ అని అర్థ‌మైంది. చిత్తూరు ఎస్పీ 14 ష‌ర‌తుల‌తో ఇచ్చిన అనుమ‌తి చూసినా నారా లోకేష్ పాద‌యాత్రకి అనుమ‌తి ఇవ్వ‌డం ఇష్టంలేద‌ని చెప్ప‌క‌నే చెబుతున్న‌ట్టున్నాయి ష‌ర‌తులు. ఏ రోడ్డుపైనా స‌భ పెట్ట‌కూడ‌దు, మూడు రోజుల‌కోసారి అనుమ‌తి తీసుకోవాలి. సాయంత్రం 5 గంట‌ల‌కే క్లోజ్ చేయాల‌ని..ఇవి 14 ష‌ర‌తుల‌లో కొన్ని మాత్ర‌మే. అన్నీ పాటించాల్సి వ‌స్తే, పాద‌యాత్ర జ‌ర‌గ‌నే జ‌ర‌గ‌దు. టిడిపి కూడా ఏపీలో ఏ పాద‌యాత్ర‌కీ లేని అనుమ‌తులు, ష‌ర‌తులు నారా లోకేష్‌కి మాత్ర‌మే ఎందుకంటూ ప్ర‌శ్నిస్తోంది. పాద‌యాత్ర బరాబ‌ర్ చేసి తీరుతామ‌ని ప్ర‌క‌టించింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read