ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు, కోర్టుల ఆగ్రహానికి గురవుతూనే ఉన్నారు. ఆ లిస్టు రోజు రోజుకీ పెరిగిపోతుంది. అయినా అధికారుల్లో ఎలాంటి మార్పు రావటం లేదనే సంకేతాలే వస్తున్నాయి. ఎందుకో ఏమో కానీ, ఈ మధ్య వారానికి రెండు మూడు ఘటనలు ఇలాంటి సంఘటనలే జరుగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, కోర్టులను లెక్క చేయటం లేదనే ప్రచారం బలంగా ఉంది. ఇప్పుడు అధికారులు కూడా అదే తీరుగా కనిపిస్తున్నారు. కోర్టు చెప్పిన పనులు చేయకుండా, కోర్టు ఆగ్రహానికి గురి అవుతున్నారు. డీజీపీ, చీఫ్ సెక్రటరీ లాంటి పెద్ద పెద్ద అధికారులు ఇప్పటికే అనేక సార్లు హైకోర్టు ఆగ్రహానికి గురయ్యారు. స్వయంగా కోర్టుకు కూడా వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు తాజాగా మరోసారి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 22వ తేదీన హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పు, పంచాయతీరాజ్‌ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది షాక్ ఇచ్చింది. ఆయనతో పాటుగా, బీసీ సంక్షేమశాఖ ప్రత్యేక సీఎస్‌ జి.అనంతరాముకి కూడా హైకోర్టు షాక్ ఇచ్చింది. ఇద్దరికీ నాన్ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది హైకోర్టు. వారి ఇద్దరినీ అరెస్ట్ చేసి, కోర్టు ముందు వారిని ప్రవేశపెట్టాలని, గుంటూరు ఎస్పీని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలతో ఒక్కసారిగా, పరిపాలన విభాగంలో అలజడి రేగింది.

dvivedi 25072021 2

సీనియర్ అధికారులు కావటంతో, ఒక్కసారిగా అలజడి రేగింది. ఈ ఆదేశాలు ఇచ్చిన హైకోర్టు, కేసు విచారణను ఆగస్ట్ 5వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే, రిటైర్డ్ అసిస్టంట్ ఇంజనీర్ ఎం.శంకరాచార్యులు, ఆయనకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ పై, కోర్టుకు వెళ్ళగా, ఆయనకు రావాల్సినవి అన్నీ తక్షణమే విడుదల చేయాలి అంటూ హైకోర్టు ఆదేశాలు జరీ చేసింది. అయితే ఆ ఆదేశాలు అమలు కాకపోవటంతో, ఆయన మళ్ళీ హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటీషన్ వేసారు. ఈ కేసు విచారణ జరిపిన న్యాయస్థానం, హైకోర్టు ముందు హాజరు కావాలి అంటూ, గోపాలకృష్ణ ద్వివేదికి ఆదేశాలు జారీ చేసింది. అయితే గురువారం జరిగిన ఈ విచారణకు గోపాలకృష్ణ ద్వివేది హాజరు కాలేదు. తమ క్లైంట్ విధి నిర్వహణలో భాగంగా ఢిల్లీ వెళ్ళారని, కోర్టుకు తెలిపి, హాజారునుంచి మినహాయింపు అడిగారు న్యాయవాది. అయితే మీరు అడిగిన మినహాయింపు, ఫైల్ లో లేదని, అయినా విచారణ మినహాయింపు అభ్యర్ధన వేరే అనుబంధ పిటీషన్ వేయటం ఏమిటి అని ప్రశ్నించారు. దీంతో ఆగ్రహం చెందిన హైకోర్ట్, వారిని తమ ముందు ప్రవేశ పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read