తిరుపతి ఉప ఎన్నిక అనేది, మన దేశ ప్రజాస్వామ్యాన్ని చూసి నవ్వుకునేలా చేసింది. ఎన్నికల ప్రక్రియ అంటే అపహాస్యం అయ్యేలా చేసింది. నవ్వులుపాలు అయ్యేలా చేసింది. అయినా స్పందించాల్సిన రాజ్యాంగ వ్యవస్థలు మౌనంగా ఉండిపోయాయి. కళ్ళ ముందు అన్యాయం జరుగుతున్నా, చోద్యం చూస్తూ ఉండి పోయారు. తిరుపతి ఉప ఎన్నిక జరిగిన రోజు, ఎన్ని వీడియో దొంగ ఓట్లకు సంబంధించి వచ్చాయో అందరూ చూసారు. ముఖ్యంగా ఒక మంత్రికి సంబంధించిన కళ్యాణమండపంలో వారిని దించటం వీడియోల రూపంలో బయటకు వచ్చింది. ఇలా అనేక వీడియోలు బయటకు వచ్చాయి. ఎన్ని దొంగ ఓట్లు పడ్డాయో తెలియదు కానీ, దొంగ ఓట్లు అయితే విపరీతంగా పడ్డాయని చూసిన వారికి అర్ధం అవుతుంది. ఈ తతంగం పై ప్రతిపక్ష పార్టీలు, ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసాయి. ఎన్నిక రద్దు చేయాలని కోరాయి. అయితే ఎలక్షన్ కమిషన్ వైపు నుంచి మాత్రం ఎలాంటి రెస్పాన్స్ లేదు. వారు ఇక్కడ ఉన్న రిటర్నింగ్ అధికారి, మైక్రో అబ్సర్వర్, సీఈసి ఇచ్చే నివేదికల పైన ఆధార పడి నిర్ణయం తీసుకుంటారు. ఈ పాటికే వారు రిపోర్ట్ ఇచ్చే ఉంటారు. అయితే ఎలక్షన్ కమిషన్ వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవటంతో, ఇక ఈసీ ఎన్నిక రద్దు పై ఎలాంటి నిర్ణయం తీసుకోదు అనే వాతవరణమే ఉంది. అందుకే కాబోలు రాజకీయ పార్టీలు, ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read