ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్, నిన్న హైకోర్టు సింగల్ బెంచ్ ఇచ్చిన తీర్పు పై, నిన్నే హైకోర్ట్ డివిజన్ బెంచ్ లో అపీల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు ఉదయమే ఈ పిటీషన్ పై విచారణ జరగాల్సి ఉండగా, పిటీషన్ ను ఈ రోజు మధ్యానానికి వాయిదా వేసారు. అయితే రాష్ట్ర ఎన్నికల కమిషన్ తరపు న్యాయవాది అశ్వనీ కుమార్, అనేక డాక్యుమెంట్లు సబ్మిట్ చేయటంతో, అవన్నీ స్క్రూటినీ చేయటానికి టైం పట్టటంతో, విచారణ నాలుగు గంటల ప్రాంతంలో ప్రారంభం అయ్యింది. అయితే విచారణ ప్రారంభం అయిన సందర్భంలో హైకోర్టు ధర్మాసనం, ఈ పిటీషన్ అత్యవసరంగా విచారణ చెయ్యాల్సిన అవసరం ఏమి ఉంది, 23న షెడ్యుల్ ఉంది కాబట్టి, 18న రెగ్యులర్ కోర్టులో ఈ పిటీషన్ వినటానికి అభ్యంతరం ఏమిటి అని ప్రశ్నించగా, దీని పై స్పందించిన ఎన్నికల కమిషన్ తరపు న్యాయవాది, ఎలెక్టోరియల్ రోల్స్ తయారు చేయాలని, 18 అయితే సమయం సరిపోదు అని చెప్పగా, రాష్ట్ర ప్రభుత్వం తరుపున అడ్వకేట్ జనరల్ స్పందిస్తూ, కేంద్ర ప్రభుత్వం, 15వ తారిఖు ఎలెక్టోరియల్ రోల్స్ పంపిస్తాం అని చెప్పిందని, సమాధానం చెప్పారు. మొత్తానికి ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు, ఈ కేసుని 18కి రెగ్యులర్ కోర్టులో మొదటి అంశంగా వాయిదా వేసింది. దీంతో మరో 5 రోజులు సస్పెన్స్ తప్పేలా లేదు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read