ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల పోరు, రోజు రోజుకీ ట్విస్ట్ ల దగ్గర నుంచి, ఇప్పుడు గంట గంటకీ ఒక ట్విస్ట్ వచ్చేలా పరిణామాలు మారుతున్నాయి. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు తీర్పు పై చాలెంజ్ చేస్తూ, సుప్రీం కోర్టులో వేసిన కేసు విచారణకు వస్తుందని అందరూ భావించారు. ఈ కేసు పై సుప్రీం కోర్టు ఏమి చెప్తుందా అని అందరూ భావించిన తరుణంలో, సుప్రీం కోర్టులో ప్రభుత్వం వేసిన పిటీషన్ తప్పుల తడకగా ఉంది అంటూ, వెనక్కు పంపించారు. అయితే తప్పులు సరి చేసి వేసే లోపు, సుప్రీం కోర్టు బెంచ్ టైం అయిపొయింది. దీంతో రేపు నోటిఫికేషన్ వస్తున్న సందర్భంలో, హౌస్ మోషన్ పిటీషన్ వేయటంతో పాటుగా, రేపు నోటిఫికేషన్ ఎలా ఆపాలి అనే దాని పై కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇక మరో పక్క ఈ రోజు ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, గవర్నర్ ని కూడా కలిసారు. ఈ నేపధ్యంలో, ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ లను తన వద్దకు పిలిపించుకున్నారు. పంచాయతీ రాజ్ శాఖ అధికారులు గోపాల కృష్ణ ద్వివేదీ, గిరిజా శంకర్‌ను జగన్ తన వద్దకు పిలిపించుకున్నారు. ముఖ్యంగా ఈ రోజు ఉదయం వీరు నిమ్మగడ్డతో భేటీ కావాల్సి ఉండగా, సుప్రీం కోర్టులో ప్రభుత్వం వేసిన పిటీషన్ పై ముఖ్యమంత్రితో చర్చించాలని, అందుకే సమావేశానికి సాయంత్రం హాజరు అవుతామని ఎన్నికల కమీషనర్ కు చెప్పారు.

dwivedi 22012021 2

అయితే ఇదే సమయంలో రేపు ఉదయం పది గంటలకు, వచ్చే నెల 4న జరుగనున్న మొదటి దశ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్, రేపు ఉదయం విడుదల కానుంది. ఈ నేపధ్యంలో, మొదటి దశ ఎన్నికల పై ఎన్నికల కమీషనర్ వేగంగా పావులు కదుపుతూ ఉండటంతో, సాయంత్రం ఎన్నికల కమీషనర్ తో జరిగే భేటీలో ఏమి వివరించాలి అనే విషయం పై, జగన్, ఇరువురు సీనియర్ అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. అయితే, ఎన్నికల కమిషన్ తో రాజీ పడి ఎన్నికలకు వెళ్తారా, లేక ఎన్నికలకు సహకరించం అంటూ, పాత పాటే పాడి, ఎన్నికలు తప్పించుకోవటానికి ఏమైనా కొత్త ఎత్తు ప్రభుత్వం వేస్తుందా అనేది చూడాలి. అయితే, ఉదయం 10 గంటలకు అపాయింట్మెంట్ ఇవ్వగా, అడిగారు కాబట్టి, మూడు గంటలకు అపాయింట్మెంట్ ఇవ్వగా, ఇప్పుడు నాలుగు గంటలు దాటినా వారు రాకపోవటంతో, సాయంత్రం 5 గంటలకు మీటింగ్‍కి హాజరుకావాలని, లేకపోతే ఇదే చివరి అవకాశం అంటూ మేమో జారీ చేసారు. దీంతో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ గోపాల కృష్ణ ద్వివేదీ, గిరిజా శంకర్‌లకు, మేమో జారీ చేయటం సంచలనంగా మారింది. ప్రభుత్వ ఒత్తిడితోనే వాళ్ళు ఇప్పటికీ రాలేదా అనే విషయం ఇప్పుడు చర్చకు దారి తీసింది...

Advertisements

Advertisements

Latest Articles

Most Read