మరో సారి రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, విచ్చల విడిగా రెచ్చిపోతున్న అధికార పార్టీకి, అదిరిపోయే జర్క్ ఇచ్చారు. ఇప్పటికే నామినేషన్ల సమయంలో, వైసీపీ చేసిన అరాచకం గురించి, దాని పై ఎన్నికల కమీషనర్ స్పందించిన తీరు తెలిసిందే. అలాగే, కరోనా మహమ్మారి భారీగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో, ఎన్నికలు పెట్టటం సరి కాదని, ఎన్నికలు వాయిదా వేసి, 5 కోట్ల మంది ప్రాణాలు కాపాడిన దేవుడిగా, నిమ్మగడ్డను ప్రసంసిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన పై, జగన్ మోహన్ రెడ్డి అండ్ కో, కుల ముద్ర వేసి విచక్షణ లేకుండా, మాట్లాడిన తీరు అందరికీ తెలిసిందే. చివరకు సుప్రీం కోర్ట్ కూడా, రమేష్ కుమార్ నిర్ణయానికి జై కొట్టింది. అయితే, కరోనా సహాయం పేరుతొ, ఇంటింటికీ వెయ్యి రూపాయాలు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో, స్థానిక సంస్థల్లో పోటీ చేసే అభ్యర్ధులు, వారే ప్రతి ఇల్లు తిరిగి, వెయ్యి రూపాయలు పంచుతూ, చివరికీ వైసీపీ ఎమ్మెల్యేలు కూడా తిరిగి పంచుతూ, ఫ్యాన్ గుర్తుకు ఓటు వెయ్యండి అని చెప్పిన వీడియోలు నెట్ లో తిరిగాయి. దీని పై ఫిర్యాదు చెయ్యటంతో, ఈ రోజు ఈసీ స్పందించింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న కరోనా వైరస్ వ్యాప్తి పరిస్థితుల నేపథ్యంలో స్వయంసేవకులతో కూడి ఆర్ధిక ప్రయోజనం అందజేయడం , స్వప్రయోజనాల కై ప్రజల మద్దతు కోరడం వంటివి జరుగుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎం. రమేష్ కుమార్ అన్నారు. ఈ విషయం పై బిజిపి అధ్యక్షుడు, సిపిఐ కార్యదర్శి వాటిని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువచ్చారని, 13 జిల్లాల జిల్లా ఎన్నికల పరిశీలకులు / జిల్లా కలెక్టర్లు లకు సోమవారం లేఖ వ్రాయడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ క్షుణ్ణంగా పరిశీలించిందని తెలిపారు. కరోనా పరిస్థితి సమయంలో ప్రజలకు ప్రయోజనాల చేకూర్చే పంపిణీ కొత్త పథకం ఎన్నికల ఉల్లంఘన కింద రాదని, ప్రస్తుతం ఎన్నికల కోడ్ వాడుకలో లేదని తెలిపారు. ఏది ఏమయినప్పటికీ, ఈ సంధి కాలంలో ఎన్నికల ప్రచారంపై నిషేధం కొనసాగుతుందని తెలియ చేస్తున్నామన్నారు.

పోటీ చేసే అభ్యర్థులు వారి స్వయ ప్రయోజనం కోసం ప్రచారం చెయ్యడం, ఓటర్లు ను ప్రభావితం చెయ్యడం ఎన్నికల ప్రక్రియ ఉల్లంఘనగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందన్నారు. కావున అటువంటి సంఘటన పై క్షేత్రస్థాయిలో దృష్టి సారించి, నిజానిజాలను విచారించి, ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకుని రావాలన్నారు. సంబంధిత అధికారులందరూ పర్యవేక్షణ ద్వారా అటువంటి సంఘటనలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలని ఎన్. రమేష్ కుమార్ వారి లేఖలో పేర్కొన్నారు. మరి ఇప్పుడు వైసీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇప్పుడు కూడా, ఆయనకు కులం అంట గుడుతూ, జగన్ వచ్చి ప్రెస్ మీట్ పెడతారో, లేక తమ పార్టీ వారితో, ఇది వరకు పెట్టించినట్టు, 70 ప్రెస్ మీట్లు పెట్టి, ఆయన్ను తిట్టిస్తారో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read