ఏపీలో వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన నుంచీ సాక్షితోపాటు దానికి మ‌ద్ద‌తుగా నిలిచే ప‌త్రిక‌ల్లో జ‌గ‌న్ బొమ్మ‌ల‌తో యాడ్స్ లేని రోజు లేదు. అయితే  వైసీపీ అధికారికంగా త‌న సొమ్ముని రూపాయి కూడా ప్ర‌చారానికి వాడుకోలేద‌ని ఎన్నిక‌ల సంఘానికి లెక్క‌లు అప్ప‌జెప్పింది. అంటే రోజూ జ‌గ‌న్ ఫోటోతో, వైసీపీ రంగులతో క‌నిపించే కోట్ల రూపాయ‌ల ప్ర‌క‌ట‌ల‌న్నీ జ‌నం సొమ్ముతోనే అని తేట‌తెల్ల‌మైంది. ప్రకటనలు, ప్రచారాల కోసం మ‌న దేశంలో వివిధ రాజ‌కీయ పార్టీల ఖర్చులను ఎన్నిక‌ల క‌మిష‌న్ వెల్ల‌డించింది. 2021-22 ఏడాదికి పార్టీల వార్షిక ఆడిట్ నివేదిక ఆధారంగా పార్టీ పరంగా ఒక్క రూపాయి కూడా యాడ్స్‌ ఖర్చు చేయని పార్టీ వైసీపీ అని తేలింది. ప్రభుత్వం నుంచి అన‌గా ప్ర‌జ‌ల సొమ్ముతో మూడున్న‌రేళ్ల‌కు పైగా పాల‌న‌లో వందల కోట్లు వెచ్చించింది జ‌గ‌న్ ప్ర‌భుత్వం. అత్యధికంగా ప్రకటనలు, ప్రచారానికి రూ.313.17 కోట్లు ఖర్చు చేసిన బీజేపీ అగ్ర‌స్థానంలో ఉంది. యాడ్స్ కోసం టీడీపీ రూ.1.66 కోట్లు, బీఆర్‍ఎస్ రూ.7.12 కోట్లు, సమాజ్‍వాదీ రూ.7.56 కోట్లు, టీఎంసీ రూ.28.95 కోట్లు, బీఎస్పీ రూ.13.83 కోట్లు ఖర్చు, ఆప్ రూ.30.29 కోట్లు, అన్నాడీఎంకే రూ.28.43 కోట్లు ఖర్చు, డీఎంకే రూ.35.40 కోట్లు, బీజేడీ రూ.16 కోట్లు, జేడీయూ రూ.36.82 లక్షలు ప్రకటనల కోసం  ఖర్చు చేశాయ‌ని ఈసీ వెల్లడించింది.  యాడ్స్ కోసం ఖ‌ర్చుల వివ‌రాలు ఈసీకి  అందించని పార్టీల జాబితాలో కాంగ్రెస్, సీపీఎం ఉన్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read