జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసులో, జగన్ ఏ1 అయితే, విజయసాయి రెడ్డి ఏ2గా ఉన్న సంగతి తెలిసిందే. దాదాపుగా 12 సిబిఐ కేసుల్లో, 5 ఈడీ కేసుల్లో జగన్, విజయసాయి రెడ్డి ఏ1, ఏ2లు గా ఉన్నారు. అయితే 2012లో మొదలైన ఈ కేసు, ఇప్పటికీ సాగుతూనే ఉండటం పై అనేక విమర్శలు కూడా వచ్చాయి. ముఖ్యంగా సిబిఐ వ్యవహరిస్తున్న తీరు పై అనేక అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. దీనికి తోడు సాంకేతిక అంశాలు పట్టుకుని, ఈ కేసుని విచారణకు రాకుండా వీళ్ళు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ప్రతి కేసులో చాలా మంది నిందితులు ఉండటం, ఒక్కో కేసులో ఒక్కొక్కరు డిశ్చార్జ్ పిటీషన్ లు వేయటం, అవి సిబిఐ కోర్టులో ఒకసారి, హైకోర్టులో ఒకసారి, సుప్రీం కోర్ట్ లో ఒకసారి, ఇలా కొట్టేసుకుంటూ పోతూ ఉండటంతో, చివరకు అసలు ఈ కేసులు ఎప్పుడు విచారణకు వస్తాయో లేదో కూడా తెలిసే పరిస్థితి లేదు. ఈ మొత్తం నేపధ్యంలో, మరోసారి కోర్టులో ఇదే సీన్ నడిచింది. అయితే సిబిఐ లా కాకుండా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మాత్రం గట్టిగా బదులు ఇచ్చారు. ఈ అక్రమ ఆస్తుల కేసులో విజయసాయి రెడ్డి రెండో ముద్దాయిగా ఉన్నారని, చెప్పిందే చెప్తూ, విజయసాయి రెడ్డి, వాయిదాల మీద వాయిదాలు తీసుకుంటూ, కావాలని జాప్యం చేస్తున్నారని ఈడీ కోర్టుకు తెలిపింది.

ed 11092021 2

కోర్టు సమయాన్ని కూడా వెస్ట్ చేస్తున్నారు అంటూ, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కోర్టుకు తెలుపుతూ, అభ్యంతరం తెలిపారు. గత మూడు వాయిదాలుగా ఇదే విదింగా, ఇవే చెప్తూ, కోర్టు సమయాన్ని వృద్ధా చేస్తున్నారు అంటూ కోర్టు ముందు వాదనలు వినిపించారు. నాంపల్లి కోర్టులో కేసు విచారణకు రాగా, ముందుగా ఈడీ కేసులు విచారణ చేపట్టవద్దు అంటూ కోర్టుని కోరారు విజయసాయి న్యాయవాదులు. ఈ విషయం పై తాము సుప్రీం కోర్టు వద్దకు వెళ్లామని, సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చే వరకు తమ అభ్యర్ధనను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. అయితే విజయసాయి రెడ్డి న్యాయవాదుల తీరు పై, ఈడీ అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, గత మూడు వాయిదాల నుంచి ఇలాగే చెప్తూ కాలక్షేపం చేసారని, వీటిని అనుమతించవద్దని, ఈడీ అభియోగాల పై ఇక విచారణ మొదలు పెట్టాలి అంటూ కోర్టుని కోరారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు, ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. మొత్తానికి ఈడీ నుంచి వచ్చిన ఊహించని రియాక్షన్ తో విజయసాయి రెడ్డి షాక్ అయ్యారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read