అమ్మో ఒకటో తారీఖు... ఇది రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రి బుగ్గనకు పట్టుకున్న భయం. ఢిల్లీ చుట్టూ అప్పు కోసం ప్రదిక్షణలు చేస్తున్నారు. అప్పు ఎవరు ఇస్తారని ఎదురు చూస్తున్నారు. కేంద్రం షరతులు సవరించాలని కోరుతున్నారు. ఇలా అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా ఫలించటం లేదు. మరో రెండు రోజుల్లో ఒకటో తారిఖు వచ్చేస్తుంది. మళ్ళీ జీతాలు ఇవ్వాలి, పెన్షన్లు ఇవ్వాలి, ఖర్చులు ఉంటాయి. ఇలా అనేక సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఈ క్రమంలో గత నాలుగు నెలలుగా జీతాలు సరిగ్గా రాకపోవటంతో, ఈ సారి పరిస్థితి పై ఉద్యోగుల్లో కూడా టెన్షన్ నెలకొంది. దీని పై ఏపీఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేసారు. జీతాలు సరైన సమయానికి రాక ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. ఎప్పుడు జీతాలు పడతాయో తెలియని పరిస్థితి ఉందని అన్నారు. రిటైర్డ్ అయిన వారికి బెనిఫిట్స్ ఇవ్వటం లేదని అన్నారు. పీఆర్సి పై గందరగోళం ఉందని అన్నారు. ఆయన ఈ రోజు తిరుపతి దర్శనం అనంతరం, మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం జీతాలు సరైన సమయానికి ఇవ్వకపోవటం పై అసహనం వ్యక్తం చేసారు. ఈ సారి అయినా జీతాలు సమయానికి పడాలని శ్రీవారిని వేడుకున్నట్టు ఆయన మీడియాతో తెలిపారు. ఒప్పంద ఉద్యోగులు పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు.

salaries 29072021 2

ఆయన మాట్లాడుతూ, "ముఖ్యమంత్రి గారిని మేము కోరుకుంటున్నాము. ఇప్పటికే 37 నెలలు జాప్యం అయ్యింది, ఇక జాప్యం లేకుండా, వెంటనే పక్క రాష్ట్రంలో ప్రకటించినట్టుగా, 11వ పీఆర్సీని వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఆర్ధిక పరిస్థితి ఇంతకు ముందు ఎప్పుడూ కూడా ఈ రాష్ట్రంలో లేదు. ముఖ్యంగా ఒక జిల్లాలో పెన్షనర్ కి పెన్షన్ పడితే, మరో జిల్లాలో పెన్షన్ పడనటువంటి పరిస్థితి ఉంది. ఈ జీతాలు కూడా, ఒకటో తారీఖు పడాలి. మా ఉద్యోగులకు జీతాలు పడటం అనేది ఒక పండుగ దినం లాంటిది. గత నాలుగు నెలలు నుంచి కూడా ఆ పండుగ అనేది లేకుండా అయిపొయింది. ఏ రోజు జీతం వస్తుందో అర్ధం కాని పరిస్థితి మాకు నెలకొంది. అలాగే పాల వాళ్ళు, కిరాణా దుకాణం వాళ్ళు కూడా, మీకు జీతాలు ఎందుకు రాలేదు, ఎప్పుడూ ఫస్ట్ తారీఖు వస్తాయి కదా అంటూ, మా ఉద్యోగులను చులకన భావంతో చూసే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ విధమైన పరిస్థితి లేకుండా, కనీసం జీతాలు అయినా ఇచ్చేందుకు ఆర్ధిక వనరులు సమకూర్చుకోవాలని కూడా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం" అని అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read