విశాఖలోని వెంకటాపురం పరిధిలో ఏర్పాటయిన దక్షిణ కొరియా కంపెనీ ఎల్జీ పాలిమర్స్ కు విలువ వందల కోట్ల రూపాయల విలువ ఉంటుందని కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఇఎఎస్ శర్మ, జగన్మో హన్ రెడ్డికి లేఖరాసారు. తనకు సానుకూలం కానిపక్షంలో ఈ కంపెనీ యాజమాన్యం ప్రభుత్వాన్ని లిటిగేషను లాగుతుందని ఆయన గుర్తుచేసారు. ప్రభుత్వం కంపెనీ భూములను వెనక్కి తీసుకో వాలని చూస్తే నిరంతరం లిటిగేషన్లోకి లాగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం జరిగిన భారీ ప్రమాదానికి సంబంధించి అసలు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఈ సంస్థ ఏర్పాటుకు ఎలా అనుమతిచ్చిందని ఆయన ప్రశ్నించారు. 2019 జూన్ లో ఈ యూనిట్ విస్తరణ, కార్యకలాపాలకు ఎపిపిసిటి ఎందుకు అనుమతించిందని ఆయన ప్రశ్నించారు. కాలుష్య నియంత్రణ మండలి ముందుగా రాష్ట్రప్రభుత్వం నుంచి కానీ, లేదా కేంద్ర పర్యావరణ శాఖనుంచి కాని క్లియరెన్సులు తీసుకోలేదని ఆయన తెలిపారు.

అన్నింటికంటే ఇక్కడ స్థాపించిన యూనిట్ అత్యంత కాలుష్యకారకమైనదని, నివాసిత ప్రాంతాలకు అతిసమీపంలో ఉందని చెపుతూ ఎపిపిసిటి ఇలాంటి వాటిని ఎట్టిపరిస్థితుల్లోను అను మతించకూడదని, అలాగే కార్యకలాపాల విస్తరణకు సైతం క్లియరెన్స్ ఇవ్వడానికి వీలులేదని ఇలాంటి పరిశ్రమలకు ఎపి కాలుష్య నియంత్రణ మండలి ఎలా విస్తరణకు అనుమతిస్తుందని వెల్లడించారు. విశాఖపట్టణం పరిసరాల్లో ఇలాంటి సంఘటనలు జరగడం ఇదేమీ కొత్తకాదని, సుమారు 30 నుంచి 40 వరకూ ప్రమాదాలు జరిగాయని, అనేక మంది కార్మికులు, పౌరులు విలువైన ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్న శర్మ ఏ ఒక్కరిపైనా ఇప్పటివరకూ జరిగిన విచారణల్లో చర్యలు తీసుకున్న సందర్భాలు లేవన్నారు.

అలాగే రాష్ట్రప్రభుత్వానికి సంబంధించి ఏ ఒక్క అధికారిపైనా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవన్నారు. దీన్ని బట్టి చూస్తే ఇలాంటి కాలుష్య కారక కంపెనీ ప్రమోటర్లు, అధికారులు కుమ్మక్కయ్యారని భావించాల్సి వస్తున్నదని ఆయన పేర్కొన్నారు. ఆలాగే ఈప్రమోటర్లకు రాజకీయ నాయకులనుంచి మద్దతు లేదని కూడా భావించలేమని, నేతల మద్దతు కూడా పొంది ఉండవచ్చన్నారు. మొదటిదశ లాక్ డౌన్ ముగిసిన వెంటనే ఎల్జీ పాలిమర్స్ కు నిర భ్యంతర ధృవీకరణ పత్రం (ఎస్ఆసి) జారీచేసారని, అత్యవసర పారిశ్రామిక సంస్థగా గుర్తించి ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ప్లాస్టిక్ ఉత్పత్తిచేసే సంస్థ నిత్యాసవరఉత్పత్తుల తయారీ కేటగిరీలోకి ఎలా వస్తుందో తనకు అర్థం కావడం లేదని ప్రభుత్వంలోని ఒక సీనియర్ ఇందుకు బాధ్యత వహించాల్సిందేనని, ఈ పొరపాటుకు ప్రభుత్వంలోని సీనియర్లదే బాధ్యత అని ఆయన పేర్కొన్నారు ప్రమాదం జరిగిన ప్రాంతానికి మూడు కిలోమీటర్ల పరిధిలో ఎందరో మహిళలు, పురుషులు, చిన్నపిల్లలు అచేతనంగా పడిపోయి ఉండటాన్ని తాను టివిల్లో ప్రత్యక్షంగా చూసి కలతచెందానన్నారు. ఈ సంఘటన చోటుచేసుకోవడం అత్యంత దుర దృష్టకరమని, కంపెనీ యాజమాన్యంపై కఠిన చర్యలు చేపట్టాలని ఆయనకోరారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read